అయోధ్య రైల్వే స్టేషన్‌కు కొత్త పేరు!

అయోధ్య రైల్వే స్టేషన్‌కు కొత్త పేరు!

అయోధ్య రైల్వే స్టేషన్ పేరును అయోధ్య ధామ్ జంక్షన్‌గా మార్చినట్లు బీజేపీ ఎంపీ లల్లూ సింగ్  తెలిపారు.  ఈ మేరకు ఇండియన్ రైల్వే కాన్ఫరెన్స్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు, ప్రజల అంచనాలకు అనుగుణంగా కొత్తగా నిర్మించిన అయోధ్య రైల్వే స్టేషన్ పేరు అయోధ్య ధామ్ జంక్షన్‌గా మార్చబడింది అని ఆయన ట్వీట్ చేశారు.  2023 డిసెంబర్ 30న కొత్తగా నిర్మించిన అయోధ్య విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిర ప్రారంభోత్సవం 2024 జనవరి 22న జరగనుంది. దీనికి ప్రధాని మోదీతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. అయోధ్యలో 71 ఎకరాల విస్తీర్ణంలో రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. 

వచ్చే నెలలో రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ ఆలయం అనేక మండపాలతో గొప్పగా నిర్మించబడింది. ఆలయం మొత్తం కుడ్యచిత్రాలు, శిల్పాలతో కూడిన స్తంభాలు ఉన్నాయి. ఒక్కో స్తంభానికి 25 నుంచి 30 బొమ్మలు ఉంటాయి. 2025  డిసెంబర్ నాటికి ఆలయ నిర్మాణం పూర్తిగా పూర్తవుతుందని భావిస్తున్నారు.