
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు అధికారులు చర్యలు చేపట్టారు.ఎయిర్ ఇండియా విమానం AI 171, బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ లో టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోను కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 133 మంది ప్రయాణికులు, 20 మంది మెడికోలు మృతిచెందినట్లు గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాలంటే కీలక సాక్ష్యం బ్లాక్ బాక్స్.. దర్యాప్తు అధికారులు బ్లాక్ బాక్స్ ను వెలికితీసే పనిలో ఉన్నారు. ప్రమాదానికి కారణాన్ని గుర్తించాలంటే బ్లాక్ బాక్స్ లో సమాచారం చాలా ముఖ్యం.
అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ దర్యాప్తుకు బ్లాక్ బాక్స్ చాలా కీలకం. యాంత్రిక వైఫల్యం, ఇంజిన్ పనిచేయకపోవడం, పక్షులు ఢీకొనడం, విమానంలో మంటలు, మానవ తప్పిదాల వంటివి ఏమైనా జరిగాయా అని ఖచ్చితంగా నిర్ధారించగలదు. టేకాఫ్ తర్వాత క్లిష్టమైన క్షణాల్లోసిబ్బంది MAYDAY కాల్ ఏవైనా ఆటోమోటెడ్ వార్నింగ్స్ , సిబ్బంది ప్రయత్నించిన చర్యలకు సంబంధించి రికార్డు చేయబడిన వివరాలను అందిస్తుంది బ్లాక్ బాక్స్..
Also Read : విమాన ప్రమాదంలో మాజీ CM విజయ్ రూపానీ మృతి
బ్లాక్ బాక్స్ అనేది ప్రమాదానికి కారణం తెలుసుకోవడంలో అత్యంత కీలకమైన సాక్ష్యం. విమాన ప్రమాదాల విషయంలో ఇది చాలా ముఖ్యమైనది. నిజానికి దీనిని సులభంగా గుర్తించేందుకు నారింజ రంగులో పెయింట్ చేస్తారు. బ్లాక్ బాక్స్ లో రెండు ప్రధాన భాగాలుంటాయి.
ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR): ఇది విమానం వేగం, ఎత్తు, ఇంజిన్ పనితీరు, నియంత్రణ ఉపరితలాల కదలికలు వంటి టెక్నికల్ డేటాను రికార్డ్ చేస్తుంది.
కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR): ఇది కాక్‌పిట్‌లో పైలట్ల సంభాషణలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో వారి కమ్యూనికేషన్లు, విమానంలో ఇతర శబ్దాలను రికార్డ్ చేస్తుంది.
ఈ రెండు రికార్డర్లలోని డేటాను విశ్లేషించడం ద్వారా ప్రమాదానికి ముందు విమానంలో ఏమి జరిగిందో పైలట్లు ఏమి మాట్లాడారో ఏ వ్యవస్థలు ఎలా పనిచేశాయో దర్యాప్తు అధికారులు తెలుసుకుంటారు.
బ్లాక్ బాక్స్ ..ప్రమాదానికి దారితీసిన కచ్చితమైన కారణాన్ని గుర్తించి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను జరగకుండా నివారించేందుకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. అందుకే బ్లాక్ బాక్స్ విమాన ప్రమాదంలో కారణాలను గుర్తించేందుకు కీలక సాక్ష్యం.