
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్ కు వేదిక వేదిక కూడా మారే అవకాశం కనిపిస్తుంది. షెడ్యూల్ ప్రకారం కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఫైనల్‌కు ఆతిధ్యమివ్వబోతున్నట్టు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వడం సర్వసాధారణం. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ సొంత వేదిక అయిన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మొదట మే 25న ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది.
కోల్‌కతాలోని ప్రతికూల వాతావరణం కారణంగా ఐపీఎల్ ఫైనల్ ను షిఫ్ట్ చేయనున్నారు. మే నెలాఖరులో కోల్‌కతాలో భారీ వర్ష సూచన ఉంది. ఈ కారణంగా ఐపీఎల్ వేదిక మారే అవాకాశం ఉంది. ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ ల కోసం బీసీసీఐ మూడు వేదికలను సిద్ధం చేసినట్టు సమాచారం. మిగిలిన మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలు షార్ట్‌లిస్ట్ చేయబడ్డాయి. పంజాబ్ కింగ్స్ సొంత వేదికలైన చండీగఢ్, ధర్మశాలలలో అనిశ్చిత పరిస్థితుల మధ్య లీగ్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు తటస్థ వేదిక కేటాయించబడే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2025 రీ స్టార్ట్ షెడ్యూల్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృత్తగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బీసీసీఐ ఐపీఎల్ ను వీలైనంత త్వరగా ప్రారంభించి ఫాస్ట్ గా ముగించాలని కోరుకుంటుంది. సోమవారం అధికారికా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఫారెన్ ప్లేయర్ల కమిట్ మెంట్ లను దృష్టిలో పెట్టుకొనే రానున్న షెడ్యూల్ లో ఎక్కువగా డబుల్ హెడ్డర్ మ్యాచ్ లు జరిపేలా ప్రయత్నాలు చేస్తున్నారు. వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ సీజన్ లోని మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ లను శుక్రవారం (మే 16) నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
మార్చి 22 నుంచి ఈ నెల 25 వరకు షెడ్యూల్ చేసిన ఐపీఎల్18వ సీజన్‌లో ఇంకా 16 మ్యాచ్‌లు మిగిలున్నాయి. ఇందులో 12 లీగ్ మ్యాచ్‌లు కాగా.. నాలుగు ప్లేఆఫ్స్ దశవి. గురువారం పంజాబ్ కింగ్స్–ఢిల్లీ క్యాపిటల్స్ పోరుమధ్యలోనే నిలిపివేసినా.. ఇరు జట్లకూ పాయింట్లు కే టాయించలేదు. ఐపీఎల్ ఎప్పుడు మొదలైనా ఎక్కడ నుంచి ఆగిపోయిందో అక్కడ నుంచి ప్రారంభం కానుంది. పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగబోయే మ్యాచ్ మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం కానుంది.
🏟️ The Grand Stage is Set!
— Six Sports India (@SixSportsIndia) May 12, 2025
The IPL 2025 Final will take place at the iconic Narendra Modi Stadium in Ahmedabad! 🔥#IPL2025 #NarendraModiStadium #IPLFinal #CricketFever #Ahmedabad #SixSports pic.twitter.com/XAPyO0nIpE