వివేక్ మిశ్రా, శృతిక జంటగా నటిస్తున్న అహోం ప్రారంభం

 వివేక్ మిశ్రా, శృతిక జంటగా నటిస్తున్న అహోం ప్రారంభం

వివేక్ మిశ్రా, శృతిక జంటగా నటిస్తున్న సినిమా  ‘అహోం’. ప్రసాద్ రాజు దర్శకత్వంలో  దశరథ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వీవీ వినాయక్ అతిథులుగా హాజరై టీమ్‌‌‌‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. 

ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని హీరో హీరోయిన్ వివేక్ మిశ్రా, శృతిక చెప్పారు.  కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సరికొత్త కథా కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శకుడు ప్రసాద్ రాజు చెప్పాడు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను నిర్మిస్తున్నట్టు నిర్మాత దశరథ్ అన్నారు.  నటులు ఆజాద్, విశ్వ,  కోటకొండ కృష్ణ, శాండీ తదితరులు పాల్గొన్నారు.