
న్యూఢిల్లీ: నష్టపరిహారం చెల్లింపు కోసం ఆర్థిక వివరాలు అడుగుతున్నారని విమాన ప్రమాద బాధితులు చేసిన ఆరోపణలను ఎయిరిండియా ఖండించింది. అవన్నీ అసత్యాలని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.
‘‘మృతులతో దరఖాస్తుదారులకు ఉన్న బంధాన్ని తెలుసుకునేందుకే మేం కొన్ని ప్రశ్నలు అడిగాం. అప్పుడే చెల్లింపులు సరిగ్గా చేయగలం. ఇలాంటి విషయాల్లో విధివిధానాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
అందుకే డాక్యుమెంట్లు సమర్పించేందుకు దరఖాస్తుదారులకు తగినంత సమయం ఇస్తున్నాం. ఇప్పటికే 47 కుటుంబాలకు తాత్కాలిక సాయం అందజేశాం. మరో 55 కుటుంబాల డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నాం” అని ప్రకటనలో పేర్కొంది.