ఏఐతో మ్యూజిక్​ .. ఇప్పుడు ఇదే ట్రెండ్

ఏఐతో మ్యూజిక్​ .. ఇప్పుడు ఇదే ట్రెండ్

వినైల్ నుంచి క్యాసెట్లు.. ఆ తర్వాత సీడీ, డీవీడీలు.. ఇప్పుడు స్ట్రీమింగ్​.. ఇలా మనం సంగీతాన్ని వినే లేదా కొనుక్కునే పద్ధతుల్లో చాలా మార్పులు వచ్చాయి. దాంతోపాటే సంగీతాన్ని సృష్టించే ఇన్​స్ట్రుమెంట్లలో కూడా మార్పులు వచ్చాయి. కానీ.. ఇప్పుడు ఏఐ వల్ల సంగీతాన్ని సృష్టించే విధానం కూడా మారిపోతోంది. ఈ మధ్య చేసిన ఒక స్టడీలో సంగీతకారులు మ్యూజిక్​ కంపోజిషన్‌‌లో ఏఐని వాడుతున్నారని తేలింది. ప్రొఫెషనల్​ మ్యూజిక్​ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు కూడా ఏఐని వాడుతున్నారట. 

ట్రాక్‌‌లిబ్ అనే సంస్థ చేసిన ఈ సర్వే ప్రకారం 25 శాతం మ్యూజిక్​ ప్రొడ్యూసర్స్​ ఇప్పుడు మ్యూజిక్​ క్రియేషన్‌‌లో ఏఐని వాడుతున్నారు.  అయితే వాళ్లలో ఎక్కువమంది (73.9%) దీనిని స్టెమ్ సపరేషన్ కోసం, సగం కంటే తక్కువమంది  (45.5%) మాస్టరింగ్, ఈక్యూ ప్లగిన్‌‌ల కోసం ఉపయోగిస్తున్నారు. కేవలం 3 శాతం మంది మాత్రమే మొత్తం పాటను సృష్టించడానికి వాడుతున్నారు.  ఈ సర్వేలో మొత్తం వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు. అందులో ఎక్కువగా యూరప్​కు చెందినవాళ్లే ఉన్నారు. మిగతావాళ్లు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పాల్గొన్నారు.