సూసైడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ : పవన్ ఖేరా

సూసైడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ : పవన్ ఖేరా
  • నిరుద్యోగం పెరిగింది.. పరీక్షలు సరిగా నిర్వహిస్తలేరు
  • తొమ్మిదేండ్లు మోసం చేసిన కేసీఆర్ కు బుద్ధి చెప్తారు
  • ఏఐసీసీ మీడియా కమిటీ చైర్మన్ పవన్ ఖేరా

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆత్మహత్యల రాజధానిగా మారిందని ఏఐసీసీ మీడియా కమిటీ చైర్మన్ పవన్ ఖేరా అన్నారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..  తొమ్మిదేండ్లుగా తమను మోసం చేస్తున్న కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని స్థితికి దిగజారిందని అన్నారు.  ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే ఆమె క్యారెక్టర్  పై బురద చల్లే  ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. నవంబర్ 30న ప్రజలు ఇచ్చే తీర్పే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతుందని అన్నారు.