సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సర్వోత్తమ్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సర్వోత్తమ్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు: ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఆదివారం హైదరాబాద్ లోని సెక్రటరియేట్‌లో  సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల సూర్యాపేట నియోజకవర్గంలో సర్పంచుల గెలుపునకు కృషి చేసిన సర్వోత్తమ్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.  రాబోయే ఎన్నికలలో సైతం నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి ఉన్నారు.