న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను నాగర్‌కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి పరామర్శించారు. ఈ మేరకు గురువారం రాజాజీ మార్గ్ లోని ఖర్గే నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఖర్గే ఆరోగ్యం, యోగక్షేమాలను మల్లు రవి అడిగి తెలుసుకున్నారు. అలాగే పార్లమెంటరీ ఎస్సీ, ఎస్టీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఫగ్గన్ సింగ్ కులస్తేతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.