- ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సహత
కొండపాక, సిద్దిపేట రూరల్, వెలుగు: ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని, గాంధీ పేరును తొలగించి సామాన్య ప్రజల్ని మోసం చేస్తోందని ఏఐసీసీ సచిన్ సహత అన్నారు. శుక్రవారం కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన రైతుల సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పథకాన్ని పేరు మార్చి వీబీజీ రామ్ జీ పేరుతో కొనసాగించాలని కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు.
కార్మిక చట్టాలను రద్దు చేయాలని చూస్తుందన్నారు. ఉపాధి హామీ చట్టాలను యధావిధిగా కొనసాగించేంతవరకు ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ భూరెడ్డి, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ పరశురాములు, మండల పార్టీ అధ్యక్షుడు లింగారావు, సర్పంచులు వెంకటేశ్, గంగాధర్, నాయకులు సుదర్శన్, తిరుపతి, రాజు, శ్రీకాంత్, హరీశ్ పాల్గొన్నారు.
గాంధీ పేరును తొలగిస్తే ఊరుకోం
నర్సాపూర్: ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగిస్తే ఊరుకోమని మెదక్ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధి హామీ చట్టాన్ని తొలగించి వీబీజీ రాంజీ చట్టాన్ని తేవాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని బొందపెట్టి రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామన్నారు. 26న ప్రతీ గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేసి కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మండల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనారు.
