16 నెలలు పదవి లేక కవిత మానసిక వేదనకు గురైతే.. మరి విద్యార్థులు?

16 నెలలు పదవి లేక కవిత మానసిక వేదనకు గురైతే.. మరి విద్యార్థులు?

16 నెలలు పదవి లేకపోతేనే కవిత అంత మానసిక వేదనకు గురైతే.. మరి 66 నెలలుగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఇంకేంత వేదన పడుతారో ఇప్పటికైనా తెలుసుకోండంటూ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సంపత్ ట్విట్ చేశారు. ఈ ట్వీట్‌కు కేసీఆర్, కవిత, కేటీఆర్‌లను ట్యాగ్ చేశారు. నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘మీ కుటుంబ రాజకీయ నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యింది కదా..! కనీసం ఇప్పుడైనా రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యను పట్టించుకోండి. 16 నెలలు ఉద్యోగం లేకపోతేనే కవిత ఎంత మానసిక వేదనకు గురయ్యిందో మీకు తెలిసింది కదా..! మరి 66 నెలలుగా అలాంటి వేదన పడుతున్న లక్షలాది మంది నిరుద్యోగుల గురించి ఇప్పుడైనా ఆలోచించండి!’ అంటూ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ ట్వీట్ చేశారు.

For More News..

కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్‌ను ఆపేసిన జాన్సన్ & జాన్సన్

మేయర్‌గా ఓవైసీ అభ్యర్థిని కూర్చొబెట్టాలని సీఎం కేసీఆర్ చూస్తున్నడు

17 ఏళ్ల యువతిపై తండ్రి, బాయ్‌ఫ్రెండ్ అత్యాచారం