మయన్మార్‌లో సంచలనం.. సూకీకి జైలు శిక్ష

మయన్మార్‌లో సంచలనం.. సూకీకి జైలు శిక్ష

అంగ్ సాన్ సూకీకి ఐదేండ్ల జైలుశిక్ష
అవినీతి కేసులో దోషిగా తేల్చిన కోర్టు 

నెపితా :
మయన్మార్ లీడర్, నోబెల్ గ్రహీత అంగ్ సాన్ సూకీకి ఐదేండ్ల జైలు శిక్ష పడింది. అవినీతి కేసులో ఆమెను దోషిగా నిర్ధారిస్తూ అక్కడి జుంటా కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. సూకీ 6 లక్షల డాలర్లు, బంగారం లంచంగా తీసుకుందని తేల్చింది. మయన్మార్ లో ప్రస్తుతం సైనిక పాలన నడుస్తోంది. పోయినేడు ఫిబ్రవరిలో సూకీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూలగొట్టి, అధికారాన్ని చేపట్టిన మిలటరీ... ఆమెపై రకరకాల కేసులు పెట్టింది. అవినీతికి సంబంధించి మొత్తం 11 కేసులు పెట్టగా, వాటిల్లో మొదటిది ఇది. కాగా, సైన్యానికి వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టడం, కరోనా రూల్స్, టెలీకమ్యూనికేషన్ లాను ఉల్లంఘించిన కేసులో సూకీకి ఇప్పటికే ఆరేండ్ల జైలు శిక్ష పడింది.