ఫిబ్రవరి 5న టీచర్ల చలో ఢిల్లీ : ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి

ఫిబ్రవరి 5న టీచర్ల చలో ఢిల్లీ : ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఇన్ సర్వీస్ టీచర్లకు ‘టెట్’ నిబంధనను రద్దు చేయాలనే డిమాండ్‌‌‌‌తో అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక (ఏఐఎఫ్‌‌‌‌టీఓ) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆ సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌‌‌‌లోని పీఆర్టీయూ స్టేట్ ఆఫీసులో శుక్రవారం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీపాల్‌‌రెడ్డి మాట్లాడారు. 

ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లు కూడా ఉద్యోగంలో కొనసాగాలంటే ‘టెట్’ ఉత్తీర్ణత సాధించాల్సిందేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ సమస్యను పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.