ఢిల్లీ ఎయిమ్స్పై సైబర్​ దాడి.. సర్వర్​ డౌన్​!

ఢిల్లీ ఎయిమ్స్పై సైబర్​ దాడి.. సర్వర్​ డౌన్​!

ఢిల్లీలోని ప్రఖ్యాత ఆలిండియా ఇన్​ స్టిట్యూట్​ ఆఫ్​మెడికల్​ సైన్సెస్​ (ఎయిమ్స్​)పై సైబర్​ దాడి జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ ఉదయం 7 గంటల నుంచే ఎయిమ్స్​ లోని స్మార్ట్​ ల్యాబ్​, రిపోర్ట్​ జనరేషన్​ విభాగం, బిల్లింగ్​, అపాయింట్మెంట్​ విభాగాల్లోని కంప్యూటర్లు మొరాయించాయి. సర్వర్లు డౌన్​ కావడంతో వాటిని పునరుద్ధరించేందుకు నేషనల్​ ఇన్ఫర్మాటిక్స్​ సెంటర్​(ఎన్​ఐసీ)  కి చెందిన సాంకేతిక నిపుణులు శ్రమిస్తున్నట్లు సమాచారం. సైబర్​ ఎటాక్​ పై దర్యాప్తును కూడా ప్రారంభించారు.

ఎయిమ్స్​ లో వినియోగించే కంప్యూటర్లలోని ఫైళ్లను తెరవకుండా అడ్డుకునే లక్ష్యంతో ఈ సైబర్​ దాడి జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. ఈనేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి ఆస్పత్రిలోని అన్ని విభాగాల కార్యకలాపాలను మ్యానువల్​ గా రిజిస్టర్లలో వివరాల నమోదు ద్వారా కొనసాగిస్తున్నారు. అకస్మాత్తుగా కంప్యూటర్లు మొరాయించడంతో ఆన్​ లైన్ లో వైద్య నిపుణుల ​ అపాయింట్మెంట్​ కోసం ఓపీ (ఔట్ పేషెంట్​) రిజిస్ట్రేషన్​ చేసుకొని వచ్చి క్యూలో నిలబడిన వారు చాలా ఇబ్బందిపడ్డారు. 1978 సంవత్సరం నుంచే ఎయిమ్స్​ లోని వైద్యసేవా విభాగాల  కంప్యూటరీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.