V6 News

ములుగులోని ట్రైబల్ వర్సిటీని సందర్శించిన ఎయిమ్స్ వైద్య బృందం

ములుగులోని ట్రైబల్  వర్సిటీని సందర్శించిన ఎయిమ్స్ వైద్య బృందం

ములుగు, వెలుగు: ములుగులోని సమ్మక్క సారక్క జాతీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని మంగళవారం హైదరాబాద్  ఎయిమ్స్​ సీనియర్  వైద్య బృందం సందర్శించింది. ములుగు మండలం జాకారంలోని వైటీసీలో నిర్వహిస్తున్న గిరిజన యూనివర్సిటీ వీసీ వైఎల్​ శ్రీనివాస్​ను ఎయిమ్స్​ సీనియర్  డాక్టర్​ రాహుల్​ నరేన్ తో పాటు ఆరుగురు డాక్టర్లు పలు అంశాలపై చర్చించారు. 

వీసీ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ఆరోగ్య సేవలను మెరుగు పర్చేందుకు యూనివర్సిటీని నోడల్  కేంద్రంగా చేసుకొని పలు కార్యక్రమాలు ప్రారంభించాలని సూచించారు. ఇందుకోసం మెడికల్  సైన్సెస్​ లో సర్టిఫికెట్  కోర్సులను ప్రారంభించాలని కోరారు. త్వరలోనే ఏఐఐఎంఎస్​ హైదరాబాద్, ములుగు సెంట్రల్  ట్రైబల్  యూనివర్సిటీ ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యతో పాటు టెక్నాలజీ అందించేందుకు చర్చలు జరుపుతామని చెప్పారు.