లాలూ ప్రసాద్ యాదవ్ కు బిగ్ షాక్... అరెస్ట్ వారెంట్ జారీ

లాలూ ప్రసాద్ యాదవ్ కు బిగ్ షాక్...   అరెస్ట్ వారెంట్ జారీ

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు బిగ్ షాక్ తగిలింది. 30 ఏళ్ల నాటి అక్రమ  ఆయుధాల కొనుగోలు కేసులో ఆయనకు  గ్వాలియర్‌లోని ఎంపి/ఎమ్మెల్యే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.  ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్ పై దాణా కుంభకోణం కేసు ఉండగా ఆయన ప్రస్తుతం బెయిల్ పైన బయట ఉన్నారు.  

కాగా  1995 97 మధ్య నింబంధనలకు విరుద్ధంగా 16 ఆయుధాలను కొనుగోలు  చేశారు.  ఈ కేసులో ఆయనకు సంబంధాలు ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు.   మూడు వేర్వేరు సంస్థల నుండి ఆయుధాలు పొందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో మొత్తం 23 మంది వ్యక్తులు చిక్కుకున్నారు, ఆరుగురిపై విచారణ కొనసాగుతోంది, ఇద్దరు మరణించారు.  14 మంది పరారీలో ఉన్నారు. పోలీసులు 1998 జూలైలో ఛార్జిషీట్ దాఖలు చేశారు