ప్రమాదకర కరెంట్ లైన్ల స్థానంలో ఎయిర్ బంచ్డ్ కేబుల్ : సీఎండీ ముషారఫ్ ఫరూఖీ

ప్రమాదకర కరెంట్ లైన్ల స్థానంలో ఎయిర్ బంచ్డ్ కేబుల్ :  సీఎండీ  ముషారఫ్ ఫరూఖీ

హైదరాబాద్​ సిటీ, వెలుగు: సిటీలోని బస్తీలు, గల్లీల్లో ఇండ్లను తాకుతూ ప్రమాదకరంగా ఉన్న  కరెంట్​తీగల స్థానంలో ప్రత్యేక ఇన్సులేషన్ ఎయిర్ బంచ్డ్ కేబుల్స్​ఏర్పాటు చేస్తున్నట్టు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, ఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. బుధవారం హెడ్డాఫీసులో మెట్రోజోన్ పరిధిలోని సుమారు 160 మంది సబ్- ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్లతో  సమీక్ష సమావేశం నిర్వహించారు. గత వారం బంజారాహిల్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్ పరిధిలో పోల్ టు పోల్ తనిఖీలు నిర్వహించామని తెలిపారు. దాదాపు 550 కిలోమీటర్ల మేర ప్రమాదకరంగా ఉన్న తీగలను గుర్తించామని, ఈ నెలాఖరులోగా ఆ ప్రాంతాల్లో ఎయిర్​బంచ్డ్​కేబుల్స్​అమర్చనున్నట్టు తెలిపారు.