దేశ భద్రతలో ఎయిర్​ఫోర్స్ కీలకం

దేశ భద్రతలో ఎయిర్​ఫోర్స్ కీలకం
  • దుండిగల్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌ అకాడమీలో చీఫ్‌‌‌‌ మార్షల్‌‌‌‌ భదౌరియా
  • గల్వాన్ ఘటన తర్వాత బోర్డర్లలో సెక్యూరిటీ పెంచినం
  • 161 మంది ఫ్లయింగ్ ఆఫీసర్స్‌‌‌‌ ట్రైనింగ్ కంప్లీట్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: పొరుగు దేశాలకు దీటుగా ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌ను బలోపేతం చేస్తున్నామని.. దేశ భద్రతలో ఎయిర్​ఫోర్స్​కీలకమని ఇండియన్ ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌ (ఏఐఎఫ్‌‌‌‌) చీఫ్‌‌‌‌ మార్షల్‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌కేఎస్‌‌‌‌ భదౌరియా అన్నారు. బోర్డర్స్‌‌‌‌లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వాయుసేన సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మేడ్చల్‌‌‌‌ జిల్లా దుండిగల్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ అకాడమీలో శనివారం ఫ్లయింగ్ ఆఫీసర్స్‌‌‌‌ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ జరిగింది. దీనికి భదౌరియా చీఫ్‌‌‌‌ గెస్ట్‌‌‌‌గా హాజరయ్యారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 161 మంది ఫ్లయింగ్ ఆఫీసర్స్‌‌‌‌, ఆరుగురు నేవీ, ఐదుగురు కోస్ట్‌‌‌‌ గార్డ్‌‌‌‌ కేడెట్స్‌‌‌‌కి దిశానిర్దేశం చేశారు. 20,500 గంటల పాటు ఫ్లయింగ్ ట్రైనింగ్‌‌‌‌ ఇవ్వడం ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌ చరిత్రలో  ఇదే మొదటిసారి అని చెప్పారు. సూర్యకిరణ్, సారంగ్ హెలికాప్టర్ డిస్ప్లే,పారాచ్యూట్‌‌‌‌జంపింగ్,పిలాటస్ ఎయిర్ క్రాఫ్ట్‌‌‌‌ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

హైటెక్నాలజీతో ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌
పరేడ్‌‌‌‌ అనంతరం చీఫ్‌‌‌‌ మార్షల్ మీడియాతో మాట్లాడారు. ‘దేశ రక్షణ వాయుసేన భుజాలపై ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఎలాంటి ఘటనలు జరిగినా దేశం విజయం సాధించడంలో ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌ కీలకపాత్ర  పోషించింది. గతేడాది జరిగిన గల్వాన్ ఘటన తర్వాత బోర్డర్స్‌‌‌‌సెక్యూరిటీపై గ్రౌండ్‌‌‌‌ రియాలిటీతో యాక్షన్ తీసుకుంటున్నాం. ఆర్మీతో కోర్డినేట్‌‌‌‌చేసుకుంటూ మానిటరింగ్‌‌‌‌ చేస్తున్నాం. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా గల్వాన్‌‌‌‌లో ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌ డిప్లాయిమెంట్స్‌‌‌‌లో మార్పులు చేస్తాం. ఈస్ట్రన్ లడక్‌‌‌‌ సెక్యూరిటీపై చర్చలు జగుతున్నాయి. 11 లెవల్స్‌‌‌‌లో బోర్డర్‌‌‌‌‌‌‌‌ డిప్లాయిమెంట్స్‌‌‌‌పై చర్చిస్తున్నాం. వెపన్స్‌‌‌‌, హై టెక్నాలజీ సెన్సార్స్‌‌‌‌, ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌ కలిగిన ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌ సిబ్బంది అలర్ట్‌‌‌‌గా ఉన్నారు..’ అని వెల్లడించారు. 

2022 టార్గెట్​గా..
రాఫెల్‌‌‌‌ యుద్ధ మిమానాల తర్వాత మరిన్ని ఆధునిక విమానాలు తేవడానికి ప్లాన్ చేస్తున్నట్లు భదౌరియా తెలిపారు. ‘2022 టార్గెట్‌‌‌‌గా మరో 36 రాఫెల్‌‌‌‌ యుద్ధ విమానాలను అందుబాటులోకి తెచ్చే విధం గా చర్యలు తీసుకుంటున్నాం. మిగ్‌‌‌‌–21 విమానాలతో పాటు ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌లో అధునాతన యుద్ధ విమానాలు ఉన్నాయి. ఆర్టిఫిషియల్‌‌‌‌ఇంటెలిజెన్స్‌‌‌‌ టెక్నాలజీ, డేటా బేస్‌‌‌‌తో ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌ డిజిటలైజేషన్ అయ్యింది. కొవిడ్ సమయంలో మన ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ విశేష సేవలు అందించింది. 2 నెలల్లో 3,800 గం టల పాటు నిరంతర కృషి చేసింది. ఆక్సిజన్‌‌‌‌, మెడిసిన్స్‌‌‌‌, ఎమర్జెన్సీ సేవలు అందించాం..’ అని చెప్పారు.