Ranji Trophy 2025-26: రంజీ ట్రోఫీలో ఆల్ టైమ్ రికార్డ్: రెండో రోజే మ్యాచ్ ఫినిష్.. టెస్ట్ మొత్తం 90 ఓవర్లే

Ranji Trophy 2025-26: రంజీ ట్రోఫీలో ఆల్ టైమ్ రికార్డ్: రెండో రోజే మ్యాచ్ ఫినిష్.. టెస్ట్ మొత్తం 90 ఓవర్లే

రంజీ ట్రోఫీలో ఆల్ టైమ్ రికార్డ్  రికార్డ్ నమోదయింది. అస్సాం, సర్వీసెస్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ కేవలం 90 ఓవర్లలోనే ముగియడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రంజీ ట్రోఫీ చరిత్రలో అతి తక్కువ ఓవర్లలో ఫినిష్ అయిన మ్యాచ్ ఇదే కావడం విశేషం. రెండో రోజే ముగిసిన మ్యాచ్ లో అస్సాంపై సర్వీసెస్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన అస్సాం జట్టు 17.2 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. ప్రద్యున్ సైకియా అర్ధ సెంచరీ (52) చేస్తే  రియాన్ పరాగ్ 31 బంతుల్లో 36 పరుగులు చేసి రాణించాడు. అర్జున్ శర్మ, మోహిత్ జాంగ్రా ఇద్దరూ హ్యాట్రిక్ సాధించడం మరో విశేషం. 

ఫస్ట్-క్లాస్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్ లో రెండు హ్యాట్రిక్‌లు నమోదవడం ఇది మూడోసారి కాగా.. రంజీ ట్రోఫీలో రెండోసారి. తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సర్వీసెస్ 108 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో సర్వీసెస్ కు తొలి ఇన్నింగ్స్ లో 5 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఇర్ఫాన్ ఖాన్ ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగిలినవారు విఫలమయ్యారు. అస్సాం బౌలర్లలో రియాన్ పరాగ్ ఐదు వికెట్లతో చెలరేగితే.. రాహుల్ సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. 

►ALSO READ | NZ vs ENG: కంబ్యాక్ అంత ఈజీ కాదు: కోహ్లీ బాటలోనే కేన్ మామ.. 9 ఏళ్ళ తర్వాత వన్డేల్లో విలియంసన్ డకౌట్

రెండో ఇన్నింగ్స్ లో అస్సాం కేవలం 75 పరుగులకే కుప్పకూలింది.  వికెట్ కీపర్ సుమిత్ ఘడిగాంకర్ 25 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా  నిలిచాడు. అర్జున్ శర్మ నాలుగు వికెట్లతో అస్సాంను చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 73 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సర్వీసెస్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్ చేసి చేసి గెలిచింది. మ్యాచ్ సరిగ్గా 90 ఓవర్లలో ముగిసింది. ఒక్క ఇన్నింగ్స్ కూడా 30 ఓవర్లు జరగకపోవడం షాకింగ్ గా అనిపిస్తోంది. నాలుగు ఇన్నింగ్స్ లు (17.2+29.2+29.3+13.5) 30 ఓవర్ల లోపే జరిగాయి. 540 బంతులతో జరిగిన ఈ మ్యాచ్ రంజీ ట్రోఫీ చరిత్రలో అతి తక్కువ సమయంతో ముగిసిన మ్యాచ్ గా చరిత్ర సృష్టించింది.