BPకి వాడే ఈ మందులతో జాగ్రత్త.. సోడియం లెవెల్స్ తగ్గించి నీరసంగా చేస్తాయి

BPకి వాడే ఈ మందులతో జాగ్రత్త.. సోడియం లెవెల్స్  తగ్గించి నీరసంగా చేస్తాయి

సాధారణంగా ప్రజలు సోడియం అనగానే ఉప్పు గురించి, ఉప్పు తగ్గించాలని సలహా ఇస్తుంటారు. కానీ సోడియం రక్తపోటును పెంచి, గుండెకు హాని కలిగించిటమే కాకుండా...  తక్కువగా సోడియం తీసుకోవడం కూడా ప్రమాదకరమే అని చెబుతున్నారు డాక్టర్లు. సోడియం అనేది ఉప్పులో ఒక భాగం కానీ ఉప్పు కాదు. 

మన శరీరం సరిగా పనిచేయడానికి కొంత సోడియం అవసరం. దీని వల్ల శరీరంలోని ద్రవాలను బ్యాలెన్స్ చేయడంలో, నరాల పనితీరుకు సహకరించడంతో పాటు గుండెతో సహా కండరాలు సరిగ్గా పనిచేయడంలో సహాయపడుతుంది.

అంతేకాదు సోడియం లెవెల్స్  పడిపోయినప్పుడు హైపోనాట్రేమియా వస్తుంది. అంటే సరిపడా ఎలక్ట్రోలైట్లు తీసుకోకుండా ఎక్కువ నీరు తాగినా, వ్యాయామం చేసేటప్పుడు ఎక్కువగా చెమట వచ్చిన, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇలా జరుగుతుంది. ఇందుకు తలనొప్పి, వికారం, గందరగోళం, కండరాల తిమ్మిరి, అలసట ఇవి సాధారణ లక్షణాలు. కొన్నిసార్లు సోడియం స్థాయిలు అకస్మాత్తుగా పడిపోతే మూర్ఛ పోవడం లేదా కోమాకు వెళ్లే ప్రమాదం ఉంది. 

సోడియం తక్కువ ఉంటే : వృద్ధులు, అథ్లెట్లు లేదా కొన్ని మందులు వాడే వారికీ సోడియం లెవెల్స్ పడిపోయే అవకాశం ఉంది. అనారోగ్యంతో ఉండి ఆహారం లేదా నీరు తక్కువగా తీసుకునే వారిలో ఇది సర్వసాధారణం.

ప్రాసెస్ చేసిన ఆహారాల్లో సోడియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని తగ్గించడం మంచిది, కానీ మీ శరీరానికి కొంత ఉప్పు అనేది అవసరం, ముఖ్యంగా మీరు యాక్టీవ్ గా ఉన్నా లేదా ఎక్కువగా చెమట పడుతున్నా కూడా. గుడ్లు, పాల పదార్థాలు, కొవ్వు తక్కువగా ఉన్న మాంసాలు వంటి సహజ సోడియం వనరులతో కూడిన బ్యాలెన్స్డ్  ఆహారం తీసుకోవడం ఆరోగ్యకరమైన స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది.

తక్కువ సోడియంకు మరో ముఖ్యమైన కారణం మందులు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ ఈ మందుల గురించి వివరించారు. 

#థియాజైడ్ డైయూరిటిక్స్ (ఉదా: హైడ్రోక్లోరోథియాజైడ్, ఇండపమైడ్)
*దీనిని అధిక రక్తపోటుకు సాధారణంగా వాడతారు.
*ఇవి మూత్రం ద్వారా  అధిక సోడియంను బయటకు పంపుతాయి, ముఖ్యంగా వృద్ధుల్లో. సోడియం తగ్గితే అలసట, గందరగోళం లేదా మూర్ఛకు దారితీయవచ్చు.

#SSRIలు (ఉదా: సెర్ట్రాలైన్, ఎస్కిటాలోప్రామ్)
*దీనిని డిప్రెషన్ ఇంకా ఆందోళనకు వాడతారు.
*ఇవి ADH (యాంటీడైయూరిటిక్ హార్మోన్) విడుదలను పెంచుతాయి, దీనివల్ల నీరు శరీరంలో నిలిచిపోయి సోడియం పలుచగా అవుతుంది. వృద్ధులలో లేదా ఇతర డైయూరిటిక్స్ తీసుకునే వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

#కార్బమాజెపైన్ లేదా ఆక్స్కార్బజెపైన్
*దీనిని మూర్ఛ నివారణకు అలాగే  మూడ్ డిసార్డర్ కి వాడతారు.
*ఇది ADH పనితీరును పెంచి SIADH (సిండ్రోమ్ ఆఫ్ ఇన్‌అప్రాపర్ యాంటీడైయూరిటిక్ హార్మోన్ సెక్రెషన్) అనే సమస్యకు దారితీస్తుంది, ఇది దీర్ఘకాలిక హైపోనాట్రేమియాకు ఒక సాధారణ కారణం.