సాయంకాలం ఐదైతే చాలు.. ఐస్ క్రీం బండి వాడు ట్రింగ్ ట్రింగ్ మని బెల్ కొడుతూ ఇళ్లచుట్టూ తిరుగుతూనే ఉంటాడు. పిల్లల్ని అప్పడింక పట్టుకోలేం. బయట అమ్మే ఐస్ క్రీంలు తినొద్దు అంటే వినిపించుకోరు. అందుకే వాటిని ఇంటిలో చేసిచ్చేయండి.
చాకొలెట్ ఐస్ క్రీం తయారీకి కావాల్సినవి
- ఫ్రెష్ క్రీం: 250గ్రా.
- కండెర్సెర్ మిల్క్: ఒక కప్పు
- మిల్క్ చాకొలెట్ :150గ్రా.
- చాకో చిప్స్: 50 గ్రాములు
- చాకొలెట్ సాస్: ఒక టేబుల్ స్పూన్
చాకొలెట్ ఐస్ క్రీం తయారీ విధానం
ముందుగా చాకొలేట్ని మెల్ట్ చేసి ఫ్రిజ్ లో కొద్దిసేపు ఉంచాలి. తర్వాత ఒక గిన్నెలో ఫ్రెష్ క్రీం, కండెన్సెడ్ మిల్క్ వేసి కొంచెం గట్టిగా అయ్యేంత వరకూ కలపాలి.
తర్వాత దానిలో మెల్ట్ అయిన చాకొలెట్ క్రీమ్సు వేసి మళ్లీ విప్ చెయ్యాలి. మిశ్రమాన్ని ఒక కప్పులో వేసి చాకో చిప్స్ తో చాకొట్ పాస్ గార్నిష్ చేసి గాలి రాకుండా టైట్ గా మూత పెట్టాలి.
అలా ఆరు గంటల సేపు డీప్ ఫ్రిజ్లో ఉంచితే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాకొలెట్ ఐస్ క్రీం రెడీ.
పాల ఐస్ క్రీం తయారీకి కావలసినవి
- పాలు: రెండు కప్పులు
- చక్కెర: రెండు టేబుల్ స్పూన్లు
- పాలపొడి: రెండు టేబుల్ స్పూన్లు
- కార్న్ ఫ్లోర్: రెండు టేబుల్ స్పూన్లు.
- యాలకుల పొడి: ఒక టీ స్పూన్
పాల ఐస్ క్రీం తయారీ విధానం
స్టవ్ పై గిన్నె పెట్టి పాలు వేడిచేసి కప్పున్నర అయేంత వరకు మరిగించాలి. ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్, పాలపొడి, యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి కలపాలి.
ఆ మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో వెయ్యాలి. తర్వాత చక్కెర వేసి చిక్కబడే వరకూ కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి. ఆ మిశ్రమాన్ని కొద్ది సేపు చల్లారనివ్వాలి.
తర్వాత ఐస్ క్రీం కప్పుల్లో మిశ్రమాన్ని వేసి దానిలో పుల్ల గుచ్చి పది గంటల సేపు డీప్ ఫ్రిజ్ లో ఉంచితే పాల ఐస్ క్రీం రెడీ...
-వెలుగు,లైఫ్–
