KGF, KGF 2, సలార్, డ్రాగన్ సినిమాల సినిమాటోగ్రాఫర్ భువనగౌడ ఓ ఇంటివాడయ్యాడు. ప్రముఖ ఎంటర్‌ప్రెన్యూర్ నిఖితను (అక్టోబర్ 24న) భువనగౌడ వివాహం చేసుకున్నారు. బెంగళూరులో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు కన్నడ సినీ ఇండస్ట్రీ కదిలొచ్చింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన సతీమణి లిఖితరెడ్డితో హాజరై కొత్త దంపతలను ఆశీర్వదించారు. ఈ పెళ్లి వేడుకలో ప్రశాంత్ నీల్-లిఖితా చక్కని సంప్రదాయ దుస్తుల్లో కనిపించి ఆకట్టుకున్నారు.
అయితే ఈ పెళ్లిలో ప్రశాంత్ నీల్ వైట్ అండ్ వైట్ పంచెకట్టులో దర్శనం ఇచ్చారు. ఈ క్రమంలో నీల్ వైఫ్ ఫన్నీ కామెంట్తో పెళ్లి ఫోటోలు షేర్ చేసి క్యూరియాసిటీ కలిగించింది. ‘ఫైనల్గా నా దొంగ మొగుడు వైట్ డ్రెస్లో మెరిసాడు’ అంటూ క్రేజీ క్యాప్షన్తో ఆసక్తి కలిగించింది.
ఇదిలా ఉంటే.. హీరో యష్ సైతం తన భార్యతో కలిసి బ్లెస్సింగ్స్ అందించారు. ఆలివ్ గ్రీన్ కుర్తాతో పాటు నల్లటి ధోతీ ప్యాంటు ధరించాడు. స్టైలిష్ సన్ గ్లాసెస్ తో తన లుక్ తో ఆకట్టుకున్నాడు. అలాగే, హీరోయిన్లు శ్రీలీల, శ్రీనిధి శెట్టి, శాన్వి శ్రీవాస్తవ, ‘కేజీఎఫ్’ ఫేమ్ గరుడ రామ్ తదితరులు పెళ్లి వేడుకలో పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తగ వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా ఈ పెళ్లిలో శ్రీలీల చీరకట్టులో వచ్చి అందర్నీ ఆకట్టుకుంది. దానికితోడు కళ్లకు గాగుల్స్ ధరించి స్మైలీ లుక్ లో కనిపించి నెటిజన్లను మెస్మరైజ్ చేసింది. ఖరీదైన డిజైనర్ శారీ, నడుముకు వడ్డానం, మెడలో భారీ ఆభరణం, ఖరీదైన యాక్ససరీస్ ధరించిన శ్రీలీల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ:
కన్నడ సినీ పరిశ్రమలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో భువన్ గౌడకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ క్రమంలోనే 'ఉగ్రం' సినిమాతో భువన్ గౌడ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తన ప్రయాణాన్ని నీల్ తో కంటిన్యూ చేస్తూ..KGF, KGF 2, సలార్ సినిమాలతో ఆడియన్స్కి కొత్త లోకం సృష్టించాడు. ప్రస్తుతం నీల్ తెరకెక్కించే సలార్ 2, ఎన్టీఆర్-నీల్ మూవీస్ కి పనిచేస్తున్నారు.
►ALSO READ | Idli Kottu OTT: ఓటీటీలోకి ధనుష్ ఫీల్ గుడ్ మూవీ ‘ఇడ్లీ కొట్టు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇండియాలో అరుదైన సినిమాటోగ్రఫీ టెక్నిక్స్తో విజువల్ వండర్స్ని క్రియేట్ చేసే, అత్యుత్తమ బెస్ట్ టెక్నీషియన్ గా భువనగౌడకు మంచి గుర్తింపు ఉంది. ఉగ్రం, కేజీఎఫ్, సలార్ ఫ్రాంఛైజీలకు తనదైన డార్క్ నెస్తో సినిమాటోగ్రఫీ అందించి.. సినిమాల విజయానికి తోడ్పడ్డాడు. అతడు దాదాపు అరడజను పైగా చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించారు. అందులో 'లొడ్డే', 'రథావర' మరియు 'భరాతే' వంటి సినిమాలు ఉన్నాయి.
