తమిళ వర్సటైల్ యాక్టర్ ధనుష్ నటించిన లేటెస్ట్ హార్ట్ టచింగ్ మూవీ ‘ఇడ్లీ కడై’. తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’. దసరా సందర్భంగా అక్టోబర్ 2న థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు మంచి అనుభూతి అందించింది. ఈ సినిమాలో ధనుష్ (మురళిగా) నటించడమే కాకుండా, రచయిత, దర్శకుడిగా, తన వండర్‌బార్ ఫిలింస్ బ్యానర్‌పై డాన్ పిక్చర్స్ భాగస్వామ్యంతో సహ-నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇందులో నిత్యా మేనన్, అరుణ్ విజయ్, షాలిని పాండే, ఆర్. పార్థిబన్, సముద్రఖని వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. దర్శకుడిగా ధనుష్‌కు ఇది నాలుగో చిత్రం కావడం విశేషం.
అయితే, ఈ మూవీకి పోటీగా థియేటర్లలో కాంతారా చాప్టర్1 దూకుడు కొనసాగించింది. ఈ క్రమంలో బాక్సాఫీస్ దగ్గర ‘ఇడ్లీ కొట్టు’ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. వరల్డ్ వైడ్గా రూ.72 కోట్లకి పైగా గ్రాస్, ఇండియా వైడ్గా రూ.50 కోట్లకి పైగా నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి.
‘ఇడ్లీ కొట్టు’ ఓటీటీ:
ధనుష్ లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా ‘ఇడ్లీ కొట్టు’ ఓటీటీకి ఎంట్రీ ఇవ్వనుంది. బుధవారం (అక్టోబర్ 29) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కి సిద్ధమైంది. తమిళంతో పాటుగా తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషలలో అందుబాటులోకి రానుంది. కథ పాతదే అయినా, ఈ సినిమాలో ఎమోషన్స్ బలంగా పండాయి. ఉద్యోగాల కోసం ఊళ్లను వదిలి వెళ్లిన చాలామందికి ఈ సినిమా తల్లిదండ్రులు, మట్టితో అనుబంధాన్ని గుర్తుచేస్తుంది.
ALSO READ : అప్పుడు నీడ పోయిందని కంప్లైంట్..
ముఖ్యంగా, కొడుకును గుర్తుపట్టని తల్లి (నిత్యామేనన్) సీన్ గుండెల్ని పిండేస్తుంది. అటు నటుడిగా, ఇటు దర్శకుడిగా ధనుష్ తన ప్రతిభను చూపారు. ధనుష్‌కి ఇలాంటి అండర్ ప్లే పాత్రలు చేయడం కొత్తేమీ కాదు, మురళిగా అతని నటన అద్భుతం. ఈ వారం ‘ఇడ్లీ కొట్టు’ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్కు మంచి ట్రీట్ అందిస్తుంది. మిస్ అవ్వకుండా చూసేయండి!!
Anbaala thodanguna idli kadai anbaala dhaan mudiyum 🥰♨️ pic.twitter.com/2jLoyFFNrP
— Netflix India South (@Netflix_INSouth) October 24, 2025
కథేంటంటే:
శంకరాపురం అనే గ్రామంలో శివకేశవ (రాజ్ కిరణ్) నడుపుతున్న ఇడ్లీ కొట్టు చాలా ప్రసిద్ధి చెందింది. అతని కొడుకు మురళి (ధనుష్) మాత్రం పల్లెటూరి జీవితం వద్దనుకొని, హోటల్ మేనేజ్‌మెంట్ చదివి, మెరుగైన ఉద్యోగం కోసం ఆరేళ్లు కుటుంబాన్ని వదిలి బ్యాంకాక్‌కు వెళ్తాడు. అక్కడ తన కంపెనీ ఓనర్ విష్ణువర్ధన్ (సత్యరాజ్) కూతురు మీరా (షాలినీ పాండే)తో పెళ్లికి సిద్ధమవుతాడు. సరిగ్గా ఈ సమయంలో శివకేశవ మరణించడంతో మురళి సొంతూరికి వస్తాడు. ఆ తర్వాత తండ్రి వారసత్వాన్ని, కుటుంబాన్ని మురళి ఎలా నిలబెట్టాడు, విష్ణువర్ధన్ కొడుకు అశ్విన్ (అరుణ్ విజయ్)తో అతనికి గొడవలు ఎందుకు వచ్చాయి అనేదే మిగతా కథ.
