Horror Thriller: అప్పుడు నీడ పోయిందని కంప్లైంట్.. ఇపుడు ఏకంగా గెదే ఆత్మగా మారిందంటూ.. ఆసక్తిగా గ్లింప్స్‌

Horror Thriller: అప్పుడు నీడ పోయిందని కంప్లైంట్.. ఇపుడు ఏకంగా గెదే ఆత్మగా మారిందంటూ.. ఆసక్తిగా గ్లింప్స్‌

ఆనంద్ రవి హీరోగా నటిస్తూ దర్శకుడిగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ‘బిగ్‌‌బాస్’ ఫేమ్ దివి హీరోయిన్‌‌గా నటిస్తోంది. భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ టైటిల్‌‌ను అనౌన్స్ చేస్తూ గ్లింప్స్‌‌ రిలీజ్ చేశారు.

ఈ చిత్రానికి  ‘నెపోలియన్ రిటర్న్స్’ అనే టైటిల్‌‌ను ఫిక్స్ చేశారు. గేదె దెయ్యం కాన్సెప్టుతో కొత్త సినిమా ప్రమోషన్‌ ప్రారంభించారు. ఓ గెదే ఆత్మగా మారి ఇబ్బంది పెడుతుందని ఇన్‌స్పెక్టర్‌కి కంప్లైంట్ ఇవ్వడం, తొమ్మిది నెలల పిల్లాడు ఆత్మగా మారే పాయింట్‌.. సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

డైరెక్టర్ ఆనంద్ రవి.. ‘నా నీడ పోయింది సార్’ అంటూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చి, తెలుగు ఆడియన్స్ కు ఓ కొత్త అనుభూతి అందించాడు. ఈ క్రమంలోనే 8 ఏళ్ల తర్వాత ‘నెపోలియన్ రిటర్న్స్ పేరుతో’ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో వస్తున్నాడు.

ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌కు దర్శకులు వశిష్ఠ, సాయి రాజేష్, అనిల్ విశ్వనాథ్ అతిథులుగా హాజరై టీమ్‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఆనంద్ రవి మాట్లాడుతూ ‘ఇప్పటివరకు నేను పేరెంట్స్, ప్రతినిధి, నెపోలియన్, కొరమీను  చిత్రాలు తీశాను. కానీ సరైన సక్సెస్, గుర్తింపు రాలేదు. ‘నెపోలియన్ రిటర్న్స్’తో సక్సెస్, మంచి గుర్తింపు వస్తుందని నమ్ముతున్నా. సినిమా అంతా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌‌‌‌టైనింగ్‌‌గా ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్‌‌తో రాబోతున్న ఈ మూవీ అందరికీ నచ్చుతుంది’ అని అన్నాడు.

ఈ చిత్రంలో తను మంచి పాత్ర పోషించానని దివి చెప్పింది. మంచి కథ, కథనంతో రాబోతున్న ఈ మూవీ ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని నిర్మాత భోగేంద్ర గుప్తా అన్నారు. ఈ సినిమాకు కార్తీక్ కొప్పెర సినిమాటోగ్రఫీ, సిద్ధార్థ్ స‌దాశివుని సంగీతాన్ని అందిస్తున్నారు.