యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నిల్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'డ్రాగన్' . హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గురించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విదేశాల్లో కొత్త షెడ్యూల్ ను ప్రారంభించేందుకు రెడీ అవుతుంది. ఆఫ్రికాలో అంత్యంత కీలకమైన షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఆఫ్రికాలో 'డ్రాగన్' షూటింగ్..
ఇందులో భాగంగా లొకేషన్ల పరిశీలన కోసం ప్రశాంత్ నీల్ తన టెక్నీకల్ టీమ్ తో కలిసి ఉత్తర ఆఫ్రికా దేశమైన ట్యునీషియాకి వెళ్లారు. ఈ వారమంతా నీల్ అక్కడే గడపనున్నట్లు తెలిసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే నవంబర్ చివరి వారంలో అక్కడే ఓ యాక్షన్ షెడ్యూల్ ను షూట్ చేస్తారని సమాచారం. అయితే ఆఫ్రికాకు వెళ్లాడానికి ముందు ఎన్టీఆర్ హైదరాబాద్ లో జరిగే ఒక ముఖ్యమైన షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొననున్నారు. దీని కోసం ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ సన్నివేశాలు సినిమా కథనానికి మరింత బలయం చేకూర్చే విధంగా ఉంటాయని తెలుస్తోంది.
రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ లో ఎన్టీఆర్..
ఈ సినిమాలో తారక్ పై ఓ వైల్డ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని సమాచారం. ఇందులో ఎన్టీఆర్ పూర్తిగా రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ లో కనిపించనున్నారు. దీని కోసమే ఎన్టీఆర్ కఠినమైన కసరత్తులు చేసి సన్నని లుక్ లోకి మారాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రుఖ్మిణీ వసంత్ కుమార్ నటిస్తోంది. వచ్చే ఏడాది జూన్ 25న ఈ మూవీనీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండాగా.. టీ సిరీస్ ఫిల్మ్స్ సంస్థ సమర్పిస్తోంది.
►ALSO READ | Chiranjeevi: 'వాల్తేరు వీరయ్య' హిట్ కాంబో రిపీట్: చిరు-బాబీల 'MEGA 158'లో కోలీవుడ్ స్టార్!
బిగ్గెస్ట్ కొలాబరేషన్
ఈ చిత్రం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మొట్టమొదటి సినిమా ఇది. ఈ నేపథ్యంలో దీనిపై పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ టేకింగ్, ఎన్టీఆర్ నటన కలిస్తే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు. కేజీఎఫ్, సలార్ వంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన దర్శకుడుగా ప్రశాంత్ నిల్ గుర్తింపు తెచ్చుకోవడంతో దీనిపై అంచనాలు తారా స్థాయికి చేరాయి.
ప్రశాంత్ నీల్ స్టైల్‌లో, అసాధారణమైన విజువల్స్, ఉద్వేగభరితమైన యాక్షన్ సీక్వెన్స్‌లతో 'డ్రాగన్' సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం ఖాయం అంటున్నారు అభిమానులు. ముఖ్యంగా, ఆఫ్రికాలో జరగబోయే ఈ భారీ యాక్షన్ ఘట్టాలు సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలవనున్నాయి.
