Chiranjeevi: 'వాల్తేరు వీరయ్య' హిట్ కాంబో రిపీట్: చిరు-బాబీల 'MEGA 158'లో కోలీవుడ్ స్టార్!

Chiranjeevi: 'వాల్తేరు వీరయ్య' హిట్ కాంబో రిపీట్: చిరు-బాబీల 'MEGA 158'లో కోలీవుడ్ స్టార్!

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'MEGA 158'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్న ఈ హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామాలో నటీనటులను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి 2027కి గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన కీలక అప్టేడ్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

మెగాస్టార్‌తో కోలీవుడ్ స్టార్..

ఈ భారీ ప్రాజెక్ట్‌లో చిరంజీవితో పాటు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. మాస్ అప్పీల్ ఉన్న ఈ బడా హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించనుండటం.. తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో ఒక భారీ క్రాస్ ఓవర్‌గా పరిగణిస్తున్నారు.  తెరపై వీరి అద్భుతమైన నటన ప్రేక్షకులకు నిజంగానే కనుల పండుగ కానుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మెగా కాంబినేషన్ ఈ చిత్రంపై ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తోంది..

చిరు-బాబీల హిట్ కాంబో రిపీట్..

ఇంతకుముందు చిరు-బాబీల కాంబినేషనల్ లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య'  బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మరో సారి వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారు. గతంలో వారి కలయికకు ప్రేక్షకులు ఘన స్వాగతం పలకడంతో, ఈ ద్వయం నుండి రాబోయే 'MEGA158' పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆసక్తికరమైన కథనాలను సృష్టించడంలో బాబీ కొల్లికి మంచి పేరు ఉంది.. 'వాల్తేరు వీరయ్య'లో చిరంజీవిని పాత గెటప్‌లో పవర్ ఫుల్  గా చూపించిన బాబీ, ఈ సినిమాలో మెగాస్టార్‌ను ఎలాంటి కొత్త కోణంలో చూపిస్తారో అని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచే అవకాశం ఉందంటున్నారు అభిమానులు.

భారీ బడ్జెట్ తో.. 

'MEGA158' ను KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ఎస్.ఎస్. థమన్ అందించనున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను కార్తీక్ ఘట్టమనేని చూసుకోనున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్టార్ పవర్, కార్తీ బహుముఖ నటన, బాబీ కొల్లి దర్శకత్వం, మరియు అగ్రశ్రేణి సాంకేతిక నిపుణుల నైపుణ్యం కలగలిసి 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం సినీ చరిత్రలో ఒక సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

►ALSO READ | Actor Sachin: బిగ్ షాక్.. ఆత్మహత్య చేసుకున్న యువనటుడు సచిన్.. అభిమానుల దిగ్భ్రాంతి

ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో  తెరకెక్కుతున్న 'మనశంకరవరప్రసాద్‌గారు' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. చిరు సరసన నయనతార నటిస్తోంది. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన 'మీసాల పిల్ల' పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి 2026కి రిలీజ్ కానుంది. మరో వైపు ఈ చిత్రంతో మెగాస్టార్ బాక్సాఫీస్ వద్ద మరో పెద్ద హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.