మరాఠీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. జమ్తారా 2 నటుడు సచిన్ చంద్‌వాడే (Sachin Chandwade) మరణించారు. మహారాష్ట్ర జల్గావ్‌లోని తన నివాసంలో ఉరివేసుకుని చనిపోయారు. 25 ఏళ్ల వయసులో సచిన్ అకాల మరణం.. అతని అభిమానులను మరియు సినీ ప్రముఖలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.
ప్రముఖ బాలీవుడ్ నివేదికల ప్రకారం.. సచిన్ చంద్‌వాడే సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ అతని కుటుంబ సభ్యులకు కనిపించాడు. వెంటనే అతన్ని తన గ్రామానికి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సచిన్ (అక్టోబర్ 24) తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో మరణించినట్లు సమాచారం. అయితే, సచిన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియల్సి ఉంది. పరోలా స్టేషన్ పోలీసులు 'ప్రమాదవశాత్తు మరణం' అని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
►ALSO READ | సినిమాటోగ్రాఫర్ పెళ్లిలో నీల్- శ్రీలీల
సచిన్ చివరిగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన రాబోయే మరాఠీ మూవీ 'అసుర్వన్' గురించి పోస్ట్ చేశాడు. సచిన్ రామచంద్ర మాంగో రచన మరియు దర్శకత్వం వహించిన ఈ మూవీలో అతను సోమ పాత్ర పోషించాల్సి ఉంది. ఇంతలోనే సచిన్ మరణించడంతో కుటుంబ సభ్యులతో పాటుగా ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సచిన్ చంద్‌వాడే గురించి?
సచిన్ చంద్వాడే మహారాష్ట్రలోని జల్గావ్‌కు చెందిన యువ మరాఠీ నటుడు. ప్రాంతీయ చిత్ర పరిశ్రమలో తన కెరీర్‌ను ఇప్పుడిప్పుడే స్థిరంగా నిర్మించుకుంటున్నాడు. అయితే, సచిన్ పూణేలోని ఐటీ రంగంలో జాబ్ చేస్తునే.. సినిమాల్లో రాణిస్తూన్నారు. ఇలా సచిన్, ఓ వైపు నటన, మరోవైపు జాబ్ చేస్తూ.. ఎంతోమంది యువ కళాకారులకు ఆదర్శంగా నిలుస్తూ వచ్చారు.
చివరికి.. సచిన్ తీసుకున్న సడెన్ డెసిషన్ అందర్నీ ఒక్కసారిగా షాక్ గురిచేసింది. ఈ క్రమంలో "ఒత్తిళ్లను అధిగమిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్న, ఇలాంటి యువ నటుడు ఆత్మహత్య చేసుకోవడం నమ్మలేకపోతున్నాం" అంటూ నెటిజన్లు ట్వీట్స్ పెడుతున్నారు.
