కెనడా మెక్‌డొనాల్డ్స్లో పనిచేస్తున్న.. ఇండియన్పై జాత్యహంకార దాడి.. వీడియో వైరల్

కెనడా మెక్‌డొనాల్డ్స్లో పనిచేస్తున్న.. ఇండియన్పై జాత్యహంకార దాడి.. వీడియో వైరల్

కెనడాలోని ఓక్‌విల్లేలో ఒక భారతీయ కార్మికుడిపై కెనడా దేశస్తుడు జాత్యంహంకారం ప్రదర్శించాడు. మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌లో పనిచేస్తున్న భారతీయుడికి ఈ చేదు అనుభవం ఎదురైంది. కెనడా యువకుడు వివక్షతో భారతీయుడిపై దుర్భాషలాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

‘నీ దేశానికి తిరిగి వెళ్ళు’ అని కేకలేస్తూ నోటికొచ్చినట్లు ఆ యువకుడు తిట్టాడు. ఒక మహిళ అతనిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఆ యువకుడు మరింత ఎక్కువ చేస్తూ.. మరింత బిగ్గరగా అరుస్తూ ఇండియాకు తిరిగి వెళ్లిపోవాలని కేకలేశాడు. ఈ జాత్యంహకార ఘటనపై సోషల్ మీడియా యూజర్లు తీవ్రంగా స్పందించారు. ఇది భయంకరమైన పరిణామం అని ఆందోళన వ్యక్తం చేశారు. 

కెనడాలో ఇలాంటి జాత్యంకార ఘటనలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయం. యూఏఈ,  సౌదీ,  ఖతార్​లో భారతీయ కార్మికులు, అమెరికా,  బ్రిటన్,  కెనడాలోని భారత  ప్రవాసీయులు జాతి వివక్షను అనుభవిస్తున్నారు. ప్రపంచంలోని  భారతీయ ప్రవాసీల సంఖ్య 2024 నాటికి సుమారు 35.42 మిలియన్కు చేరింది. 2024లో భారత వలసవాదుల సంఖ్య అమెరికాలో సుమారుగా  54 లక్షలు,  బ్రిటన్ 18.6 లక్షలు,  సౌదీ అరేబియా  24.6 లక్షలుగా ఉన్నారు. ఈ తరుణంలో కొన్ని దేశాలు వారి అతి జాతీయ భావం, అభద్రతా భావంతో.. యూఎన్​ఓ, ప్రపంచీకరణ సూత్రాలకు విరుద్ధంగా జాతి వివక్ష ఘటనలు జరుగుతున్నాయి.   

ప్రతి మనిషి సమాన హక్కులు, గౌరవం, అవకాశాలు పొందాల్సిన హక్కు కలిగినవాడే.  జాతి, వర్ణం, మతం, భాష అనే భేదాలు మనిషి విలువను నిర్ణయించవు.  కాబట్టి, జాతి అహంకారాన్ని నిర్మూలించి, సమానత్వం, సౌభ్రాతృత్వం, మానవతా విలువలతో ముందుకు సాగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. మానవ వనరులు అధికంగా ఉన్న భారతదేశం  ప్రపంచానికి చాలా అవసరం.