ఫేస్ బుక్ లో అమ్మాయి పేరుతో ఫ్రెండ్షిప్.. రూ. పది లక్షలు కాజేసిన సైబర్ చీటర్స్..

ఫేస్ బుక్ లో అమ్మాయి పేరుతో ఫ్రెండ్షిప్.. రూ. పది లక్షలు కాజేసిన సైబర్ చీటర్స్..

సైబర్ నేరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.. ప్రభుత్వాలు, పోలీస్ శాఖ అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ జనం సైబర్ నేరగాళ్ల మాయలో పడి మోసపోతూనే ఉన్నారు. హైదరాబాద్ లో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఫేస్ బుక్ లో అమ్మాయితో పేరుతో ఫ్రెండ్షిప్ చేసి ఓ వ్యక్తి నుంచి రూ. 10 లక్షలు కాజేసారు చీటర్స్. హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

హైదరాబాద్ లంగర్ హౌస్ కి చెందిన 42 ఏళ్ళ వ్యక్తికి ఫేస్ బుక్ లో సాయి ప్రీతి పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది.. యాక్సెప్ట్ చేసిన బాదితుడితో అమ్మాయిలాగా చాటింగ్ చేయడం స్టార్ట్ చేశారు చీటర్స్. తాను వైజాగ్ ప్రాంతానికి చెందిన యువతిని అని , ప్రస్తుతం యూకే లో నివాసిస్తున్నట్లు చెప్పారు కేటుగాళ్లు. కొన్ని రోజులు చాట్ చేసిన తరువాత ఆన్లైన్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని బాధితుడిని నమ్మించారు చీటర్స్.

►ALSO READ | అమ్మా.. చెల్లిని అమ్మొద్దు.. తల్లి కాళ్ళ మీద పడి వేడుకున్న ఇద్దరు కూతుర్లు !

స్కామర్స్ సూచనల మేరకు మొదట 50 వేలు ఇన్వెస్ట్ చేశాడు బాధితుడు. వ్యాలెట్ లో లాభాలు వచ్చినట్లు చూపడంతో , బాధితుడు పలు దఫాలుగా 10 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు.ఆ డబ్బులను విత్ డ్రా చేయడానికి టాక్స్ పేరుతో ఇంకా డబ్బులు డిమాండ్ చేసిన స్కామర్స్. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు ఇది స్కామ్ అని గ్రహించాడు. మోసపోయానంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడుబాధితుడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో అపరిచిత వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేయొద్దని.. అధిక లాభాల పేరుతో వచ్చే మెసేజ్ లను నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు పోలీసులు.