లిక్కర్లో లక్కీ కపుల్.. లాటరీలో భార్యా భర్తలిద్దరికీ షాపులు..

లిక్కర్లో లక్కీ కపుల్.. లాటరీలో భార్యా భర్తలిద్దరికీ షాపులు..
  • అనుచరుడి పేరుతో మూడోది సైతం
  • వరంగల్ జిల్లా నర్సంపేట దంపతులను వరించిన అదృష్టం

వరంగల్ (నర్సంపేట): మద్యం షాపుల కోసం నిర్వహించిన టెండర్లలో ఓ కుటుంబాన్ని అదృష్టం వరించింది. భార్యాభర్తలిద్దరూ లాటరీ విధానంలో షాపులు దక్కించుకున్నారు. అంతే కాదు. తమ అనుచరుడి పేరుతో వేసిన దరఖా స్తును కూడా లిక్కర్ షాపు వరించింది. వరంగల్ రూరల్ జిల్లా వైన్స్ షాపుల లక్కీ డ్రా ఉర్సుగుట్ట సమీపంలోని నాని గార్డెన్లో నిర్వహించారు. 

2025-27 నూతన మద్యం పాలసీ కింద చేప ట్టిన టెండర్లలో నర్సంపేటకు చెందిన గంప రా జేశ్వర్ గౌడ్.. తన పేరుతో పాటు తన భార్య సాం బలక్ష్మీ, తన అనుచరుడు ప్రయణ్ పేరుతో దర ఖాస్తు చేశారు. ఇవాళ నిర్వహించిన లాటరీలో ముగ్గురి పేర్లతో మూడు షాపులు రావడంతో ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.

ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని మొత్తం 2,620 మద్యం దుకాణాలకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్‌‌‌‌ చుట్టుపక్కల జిల్లాల్లో వైన్స్​కోసం డిమాండ్ భారీగా ఉంది. శంషాబాద్‌‌‌‌లో అత్యధికంగా 100 దుకాణాలకు 8,536 దరఖాస్తులు రాగా, సరూర్‌‌‌‌నగర్‌‌‌‌లో 134 షాపులకు 7,845 దరఖాస్తులు వచ్చాయి. మేడ్చల్‌‌‌‌లో 114 షాపులకు 6,063 దరఖాస్తులు, మల్కాజ్‌‌‌‌గిరిలో 88 షాపులకు 5,168 దరఖాస్తులు దాఖలయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే, నల్లగొండలో 155 షాపులకు 4,906 దరఖాస్తులు, ఖమ్మంలో 122 షాపులకు 4,430 దరఖాస్తులు, సంగారెడ్డిలో 101 షాపులకు 4,432 దరఖాస్తులు వచ్చాయి.

►ALSO READ | కరీంనగర్ జిల్లాలో షాకింగ్ ఇన్సిడెంట్.. స్కూల్లో గర్ల్స్ వాష్ రూమ్లో సీక్రెట్ కెమెరాలు

మిగిలిన జిల్లాల వివరాలను పరిశీలిస్తే... నిర్మల్‌‌‌‌లో 47 షాపులకు 3,002 దరఖాస్తులు, నిజామాబాద్‌‌‌‌లో 102 షాపులకు 2,786 , కరీంనగర్‌‌‌‌లో 94 షాపులకు 2,730, యాదాద్రి భువనగిరిలో 82 షాపులకు 2,776, సిద్దిపేటలో 93 షాపులకు 2,782, సూర్యపేటలో 99 షాపులకు 2,771 వచ్చాయి. అలాగే మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌లో 90 మద్యం దుకాణాలకు 2,487 దరఖాస్తులు, జగిత్యాలలో 71 వైన్స్​లకు  1,966, వరంగల్‌‌‌‌ అర్బన్‌‌‌‌లో 65కు 3,175 దరఖాస్తులు వచ్చాయి. 

తక్కువ సంఖ్యలో షాపులు ఉన్న జిల్లాల్లో సైతం అప్లికేషన్ల జోరు తగ్గలేదు. వరంగల్‌‌‌‌ రూరల్‌‌‌‌లో 63 షాప్​లకు1,958, మహబూబాబాద్‌‌‌‌లో 59 వైన్స్​లకు1,800, భూపాలపల్లిలో 60 వైన్స్​లకు1,863, వికారాబాద్‌‌‌‌లో 59 వైన్స్​లకు1,808 దరఖాస్తులు దాఖలయ్యాయి. మెదక్‌‌‌‌ లో 49 వైన్స్​లకు1,920, కామారెడ్డిలో 49 షాపులకు 1,502, రాజన్న సిరిసిల్లలో 48 వైన్స్​లకు1,381, జనగామలో 47 వైన్స్​లకు1,697, పెద్దపల్లిలో 77 వైన్స్​లకు1,507 అప్లికేషన్లు వచ్చాయి. తక్కువగా జోగులాంబ గద్వాల 36 వైన్స్​లకు774, ఆదిలాబాద్‌‌‌‌ 40 వైన్స్​లకు 771, వనపర్తిలో 37 వైన్స్​లకు 757 అప్లికేషన్లు వచ్చాయి.