Balakrishna: 'NBK111' లో లేడీ సూపర్ స్టార్.. బాలయ్యతో నాలుగోసారి జోడీ కట్టనున్న నయనతార!

Balakrishna: 'NBK111' లో లేడీ సూపర్ స్టార్.. బాలయ్యతో నాలుగోసారి జోడీ కట్టనున్న నయనతార!

వరుస విజయాలతో నటసింహం నందమూరి బాలకృష్ణ దూసుకుపోతున్నారు. భారీ అంచనాలతో 'అఖండ 2 తాండవం' డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తన తదుపరి చిత్రం గురించి  వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి సినీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మాస్ దర్శకుడు మలినేని గోపిచంద్ దర్శకత్వంతో రూపొందుతున్న బాలయ్య 'NBK111'లో కథనాయికగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

హిట్ కాంబినేషన్ రిపీట్..

తెలుగు,తమిళం,కన్నడ, మలయాళం భాషల్లో బిజీగా ఉన్న నయనతార.. బాలకృష్ణతో కలిసి నటించనున్నారనే టాక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. గతంలో ఈ సూపర్ హిట్ జోడీ 'సింహా', 'శ్రీరామరాజ్యం', 'జై సింహా' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు, నాలుగోసారి వీరిద్దరూ కలిసి స్క్రీన్ పంచుకోనున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ సినిమాలో నయనతార పాత్ర..  స్త్రీ శక్తిని ప్రతిబింబించేలా, చాలా బలమైన పాత్రగా ఉండబోతుందని సమాచారం..

హిస్టారికల్ రోర్..

చారిత్రక నేపథ్యంలో తెరకెక్కించనున్న ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా వెలువడనుంది. వాస్తవానికి ఈ సినిమా పూజా కార్యక్రమం అక్టోబర్‌లో జరగాల్సి ఉంది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది నవంబర్ 7వ తేదీకి మారింది. ఈ సినిమా బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబోలో రెండోది. వీరి కలయికలో వచ్చిన గత చిత్రం 'వీరసింహారెడ్డి' ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో 'NBK111' ను నిర్మాతలు అత్యంత భారీ స్థాయిలో, గ్రాండీయర్‌తో రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తనదైన మాస్ టచ్‌తో కమర్షియల్‌గా సక్సెస్ అయిన సినిమాలు తీయడంలో దర్శకుడు మలినేని గోపీచంద్ సిద్ధహస్తుడు. అయితే ఆయన తొలిసారిగా ఒక చారిత్రక నేపథ్యం ఉన్న కథను తెరకెక్కించనుండటం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది.

►ALSO READ | NTR Dragon : ఆఫ్రికాలో జూ. ఎన్టీఆర్ 'డ్రాగన్' షూటింగ్.. భారీ యాక్షన్ కోసం ట్యునీషియాలో ప్రశాంత్ నీల్ రెక్కీ!

సరికొత్త లుక్ బాలయ్య ..

ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో కనిపించనున్నారని సమాచారం.. ఈ కథ భావోద్వేగం, యాక్షన్ సన్నివేశాలు, అద్భుతమైన విజువల్స్‌తో నిండి ఉంటుందని తెలుస్తోంది.  ఈ చిత్రం చరిత్ర, వర్తమానం అనే రెండు విభిన్న కాలాల నేపథ్యంలో సాగే 'పీరియాడిక్ డ్రామా' గా ఉండబోతోందని, ఇందులో కొన్ని టైం ట్రావెల్ ఎలిమెంట్స్ కూడా ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చనడుస్తోంది . ఇది నిజమైతే, బాలయ్య పాత చిత్రం 'ఆదిత్య 369' ని గుర్తు చేస్తూ అభిమానులకు మరింత కిక్ ఇచ్చే అంశం అవుతుంది.

ప్రస్తుతం సినిమా బృందం చిత్రీకరణ కోసం రాజస్థాన్‌లో లొకేషన్ల అన్వేషణలో నిమగ్నమై ఉంది. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కు సంబంధించిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. నవంబర్‌లో జరగనున్న పూజా కార్యక్రమంతో ఈ చారిత్రక గర్జన మొదలుకానుంది...