న్యూఢిల్లీ: ఇండియా, ఆస్ట్రే్లియా మధ్య సిడ్ని వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. క్యాచ్ పట్టే క్రమంలో పక్కటెములకు గాయం కావడంతో గ్రౌండ్‌లోనే నొప్పితో అల్లాడిపోయాడు అయ్యర్. జట్టు సహయక సిబ్బంది వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో సిడ్నిలోని ఓ ఆసుపత్రిలో ఐసీయూలో అయ్యర్‌కు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో అయ్యర్ హెల్త్ కండిషన్‌పై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది.
‘‘2025 అక్టోబర్ 25న సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు శ్రేయాస్ అయ్యర్ ఎడమ దిగువ పక్కటెముక ప్రాంతంలో గాయమైంది. జట్టు సహయక సిబ్బంది వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్‌లో అయ్యర్ ప్లీహానికి గాయమైనట్లు తేలింది. ప్రస్తుతం సిడ్నీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అయ్యర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. గాయం నుంచి త్వరగా కోలుకుంటున్నాడు. సిడ్నీ, ఇండియాలోని నిపుణులతో సంప్రదించి బీసీసీఐ వైద్య బృందం అతని గాయం స్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. అయ్యర్ రోజువారీ పురోగతిని అంచనా వేయడానికి భారత జట్టు వైద్యుడు శ్రేయాస్‌తో కలిసి సిడ్నీలోనే ఉంటారు’’ అని బీసీసీఐ పేర్కొంది.
మూడో వన్డేలో శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన ఫీల్డింగ్‌తో అబ్బురపరిచారు. శనివారం (అక్టోబర్ 25)న జరిగిన వన్డేలో అయ్యర్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌కు ఫిదా కావాల్సిందే. హర్షిత్ రాణా వేసిన ఇన్నింగ్స్ 34 ఓవర్ నాలుగో బంతి ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బాల్ గాల్లోకి లేచింది. బ్యాక్‌వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయాస్ అయ్యర్ వెనక్కి వేగంగా పరిగెత్తాడు. అసాధ్యమనుకున్న క్యాచ్‌ను డైవ్ చేస్తూ అందుకున్నాడు.
స్టన్నింగ్ క్యాచ్ పట్టి ఆశ్చర్యానికి గురి చేసిన అయ్యర్ గాయపడ్డాడు. డైవ్ చేసినప్పుడు అతని భుజం నేలకు బలంగా తాకింది. దీంతో గ్రౌండ్‌లోనే నొప్పితో కాసేపు విలవిల్లాడాడు. నొప్పి ఎక్కువగా ఉండడంతో గ్రౌండ్ వదిలి వెళ్ళాడు. వైద్య పరీక్షల్లో శ్రేయాస్‌కు అంతర్గతంగా రక్తస్రావం అయినట్లు వైద్యులు గుర్తించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అయ్యర్ కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
