ఢిల్లీలో డేంజర్ లెవల్‎కు గాలి కాలుష్యం

ఢిల్లీలో డేంజర్ లెవల్‎కు గాలి కాలుష్యం

న్యూఢిల్లీ: చలికాలం నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ సమస్య మరింత తీవ్రమైంది. దీంతో ఢిల్లీ అంతటా కాలుష్య నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేస్తున్నట్లు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ (సీఏక్యూఎం) శనివారం వెల్లడించింది. ఈ క్రమంలోనే ఢిల్లీ- ఎన్సీఆర్‎లో వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ఉపయోగించే అత్యవసర చర్యల విధానమైన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ)ని సవరించింది.

ప్రస్తుతం ఢిల్లీలో ఏక్యూఐ 'వెరీ పూర్ (301-నుంచి 400)' పరిధిలో కొనసాగుతున్నందున జీఆర్ఏపీలోని స్టేజ్-2 చర్యలను స్టేజ్-1కు, స్టేజ్-3 చర్యలను స్టేజ్-2కు, స్టేజ్-4 చర్యలను స్టేజ్-3కు మార్చింది. స్టేజ్-1 ప్రకారం.. ఏక్యూఐ 201 నుంచి 300 మధ్య ఉంటే పూర్​గా పేర్కొంటారు. అప్పుడు ఢిల్లీలో డీజిల్ జనరేటర్ల వాడకాన్ని తగ్గిస్తారు. నిరంతరం కరెంట్ సప్లై చేస్తారు. ట్రాఫిక్ ఎక్కువ ఉండేచోట్ల అదనపు పోలీసులను నియమిస్తారు.