ఢిల్లీని కమ్మేసిన పొగమంచు

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు

దేశ రాజధానిలో పొగమంచు రోజురోజుకూ పెరిగిపోతోంది. నగరం మొత్తం పొగమంచుతో కప్పబడి ఉండడంతో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. పగటి పూట సైతం రోడ్లపై వాహనాలు కనిపించని పరిస్థితి కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక దీపావళి సందర్భంగా క్రాకర్స్‌తో వాతావరణం ఎంత అధ్వానంగా తయారవుతుందోనని పర్యవారణవేత్తలు భయపడుతున్నారు.

SAFAR స్టడీ ప్రకారం, ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంతంలో గాలి నాణ్యత 319గా నమోదైనట్టు తెలుస్తోంది. నోయిడాలో సైతం ఇదే పరిస్థితి. అక్కడ 309గా రికార్డయినట్టు సమాచారం. సాధారణంగా గాలి నాణ్యత సున్నా నుంచి 50మధ్య ఉంటే వాతావరణం బాగుందని, 51 నుంచి 100మధ్య ఉంటే సంతృప్తికరంగానూ, 101నుంచి 200 మధ్య ఉంటే మధ్యస్థమని, 201 నుంచి 300 గా ఉంటే కొంచెం పర్లేదు అని, 301 నుంచి 400మధ్యగా ఉంటే పరిస్థితి దారుణమని, 401 నుంచి 500మధ్య ఉంటే చాలా తీవ్రమైనది పరిగణిస్తారు.