హైదరాబాద్ నుంచి మాలెకు విమాన సర్వీసులు 

V6 Velugu Posted on Aug 22, 2021

  • వారానికి మూడురోజులు విమానాలు

హైదరాబాద్ నుంచి మాల్దీవుల రాజధాని మాలేకు విమాన సర్వీసులు ఆదివారం పునః ప్రారంభమయ్యాయి. ఇండిగో సంస్థ వారంలో మూడు రోజులపాటు ఈ విమాన సర్వీసులు నడుపుతోంది. ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తొలివిమానం బయలుదేరి వెళ్లింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇండిగో విమానం 6ఈ 8108 మధ్యాహ్నం 2.20కు  మాలేకు బయలుదేరింది. సాయంత్రం 4.30 గంటలకు ఆది మాలే లని వెలనా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. 
ఇవాళ్టి నుండి వారానికి మూడు రోజులు అంటే ఆదివారం, మంగళవారం, గురువారాల్లో  మాలెకు విమానాలు నడపనున్నట్లు ఇండిగో ప్రకటించింది. రద్దీ పెరిగాక అక్టోబర్ 15 నుంచి వారానికి నాలుగు రోజులు అంటే ప్రతి  ఆది, సోమ, బుధ, శుక్రవారాల్లో విమానాలు నడుపుతామని ఇండిగో వెల్లడించింది. 
 

Tagged Hyderabad Today, , Air services from Hyderabad, international flights from hyderabad, hyderabad too Male air services, Indigo air services

Latest Videos

Subscribe Now

More News