రేట్లు పెంచనున్న ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌ .. ఎన్నికల తర్వాత 15 శాతం వరకు టారిఫ్‌‌‌‌‌‌‌‌లు పెరిగే ఛాన్స్‌‌‌‌‌‌‌‌

రేట్లు పెంచనున్న ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌ .. ఎన్నికల తర్వాత 15 శాతం వరకు టారిఫ్‌‌‌‌‌‌‌‌లు పెరిగే ఛాన్స్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: లోక్​సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్లాన్ రేట్లను పెంచాలని ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌ చూస్తోంది.  ప్రస్తుతం జియోతో పోలిస్తే ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌   ప్లాన్ల ధరలు కొద్దిగా  ఎక్కువ.  టారిఫ్‌‌‌‌‌‌‌‌లు పెరిగితే జియో కూడా రేట్లను పెంచే అవకాశం ఉంది. ఐపీఎల్ సీజన్ కావడంతో డేటా వినియోగం పెరుగుతుందని ఈ కంపెనీ భావిస్తోంది. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్ నుంచి కస్టమర్లను ఆకర్షించాలని చూస్తోంది.  5జీ డేటా వేగంగా అయిపోతుండడంతో యూజర్లు ఎక్కువ విలువుండే ప్లాన్లకు షిఫ్ట్ అవుతున్నారని జియో ఎగ్జిక్యూటివ్ ఒకరు పేర్కొన్నారు. వివిధ సర్వీస్‌‌‌‌‌‌‌‌లతో కలిపి  జియో ఫైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రాడ్‌‌‌‌‌‌‌‌బ్యాండ్‌‌‌‌‌‌‌‌ అందిస్తున్న ప్లాన్స్‌‌‌‌‌‌‌‌ను పెంచుతామని అన్నారు.

యావరేజ్‌‌‌‌‌‌‌‌ రెవెన్యూ పెర్ యూజర్ (ఆర్పూ) పెరుగుతుందని అంచనా వేశారు.  బ్రోకరేజ్ కంపెనీలు కూడా టారిఫ్‌‌‌‌‌‌‌‌లను మొదట ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెలే పెంచుతుందని భావిస్తున్నారు.  ‘ఎలక్షన్స్ తర్వాత (జులై – అక్టోబర్ మధ్య) టారిఫ్‌‌‌‌‌‌‌‌లు 15 శాతం మేర  పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌ ఆర్పూ 2025–26 లో రూ.260 దాటుతుంది’ అని బెర్న్‌‌‌‌‌‌‌‌స్టెయిన్‌‌‌‌‌‌‌‌ పేర్కొంది.   2026 లో టెలికం ఇండస్ట్రీ రెవెన్యూలో 48 శాతం వాటా జియోది, 40 శాతం ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌ది ఉంటుందని తెలిపింది.