
న్యూఢిల్లీ: భారతదేశంలో రెండవ అతిపెద్ద టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో శనివారం (అక్టోబర్ 11) ఎయిర్ టెల్ సర్వీస్ నిలిచిపోయింది. వినియోగదారులు నెట్వర్క్ సంబంధిత ఇష్యూస్ ఎదుర్కొంటున్నారు. ఫోన్ కాల్స్ కనెక్ట్ కాకపోవడం, మాట్లాడుతుండగానే మధ్యలోనే కాల్ కట్ అవడం.. ఇంటర్నెట్ సరిగ్గా అందకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. మొబైల్ డేటా రాకపోవడంతో యూపీఐ ద్వారా ఆన్ లైన్ చెల్లింపుల్లో అంతరాయం ఏర్పడింది.
నెట్ వర్క్ ఇష్యూ గురించి వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నెట్ వర్క్ ఇష్యూపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్ టెల్కు ఏమైందంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రముఖ ఔటేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ 'డౌన్ డిటెక్టర్' ప్రకారం.. వినియోగదారులు శనివారం (అక్టోబర్ 11) ఉదయం నుంచి ఎయిర్‌టెల్ సేవల్లో అంతరాయం గురించి ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు.
ALSO READ : Zoho మెయిల్‌కి అన్ని Gmail ఈమెయిల్స్ ను..
కంప్లైంట్లలో ఎక్కువ శాతం వాయిస్, డేటా సేవలకు సంబంధించినవే. 58% మంది మొబైల్ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయలేకపోతున్నామని తెలిపారు. మరో 31 శాతం మంది సిగ్నల్ అందడం లేదని కంప్లైంట్ చేశారు. 11శాతం మంది మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడంలో సమస్యలను ఎదుర్కొన్నామని చెప్పారు. నెట్ వర్క్ ఇష్యూపై ఎయిర్ టెల్ స్పందించింది. సేవల్లో అంతరాయంతో ఇబ్బందులు ఎదుర్కొన్న వినియోగదారులకు క్షమాపణ చెప్పింది. వీలైనంత త్వరగా సేవలను పునరుద్ధరించనున్నట్లు వెల్లడించింది.