సైబర్ ఫ్రాడ్స్‌‌ పెరుగుతున్నాయ్..ఎయిర్‌‌‌‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌‌కు మారండి

సైబర్ ఫ్రాడ్స్‌‌ పెరుగుతున్నాయ్..ఎయిర్‌‌‌‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌‌కు మారండి
  • ఎయిర్‌‌‌‌టెల్ వైస్ చైర్మన్  గోపాల్ విఠల్​ సూచన

న్యూఢిల్లీ: ఇండియాలో సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు తమ  ప్రధాన బ్యాంక్ ఖాతాకు బదులుగా ఎయిర్‌‌‌‌టెల్ పేమెంట్స్ బ్యాంక్  ద్వారా ఆన్‌‌లైన్ చెల్లింపులు చేయాలని ఎయిర్‌‌టెల్ వైస్ చైర్మన్ గోపాల్ విఠల్  సూచించారు. 

సైబర్ నేరగాళ్లు  ఫేక్ పార్సిల్ నోటిఫికేషన్లు, రివార్డ్ లింకులు, డిజిటల్ అరెస్ట్ బెదిరింపులు వంటి పద్ధతులను ఉపయోగిస్తున్నారని ఆయన హెచ్చరించారు. చిన్న తప్పిదం వల్ల మొత్తం పొదుపులు ప్రమాదంలో పడతాయని చెప్పారు. 

ఎయిర్‌‌‌‌టెల్ పేమెంట్స్  బ్యాంక్‌‌లో చిన్న మొత్తాన్ని ఉంచి చెల్లింపులు చేస్తే, పొరపాటున ఫ్రాడ్‌ జరిగినా పెద్ద నష్టం జరగదని 
అభిప్రాయపడ్డారు.