ఏప్రిల్ నెల 3న ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌ సబ్సిడరీ ఐపీఓ

ఏప్రిల్ నెల 3న ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌ సబ్సిడరీ ఐపీఓ

న్యూఢిల్లీ: ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ సబ్సిడరీ భారతీ హెక్సకామ్‌‌‌‌ ఐపీఓ  ఏప్రిల్‌‌‌‌ 3 న  ఓపెన్ కానుంది. అదే నెల 5 న ముగుస్తుంది.  యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఏప్రిల్‌‌‌‌ 2 న ఓపెన్‌‌‌‌లో ఉంటుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో వచ్చే మొదటి ఐపీఓగా భారతీ హెక్సాకామ్‌‌‌‌ నిలవనుంది. రెడ్‌‌‌‌ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌‌‌‌ (ఆర్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌పీ) ప్రకారం, కంపెనీ ఐపీఓలో కేవలం ఆఫర్ ఫర్ సేల్ మాత్రమే ఉంటుంది. సుమారు 15 శాతం వాటాకు సమానమైన 7.5 కోట్ల షేర్లను  షేర్‌‌‌‌‌‌‌‌ హోల్డర్ టెలీకమ్యూనికేషన్స్‌‌‌‌ కన్సల్టెంట్స్‌‌‌‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అమ్మనుంది. 

గతంలో 10 కోట్ల షేర్లను అమ్మాలని చూడగా, తాజాగా తగ్గించింది. భారతీ హెక్సాకామ్‌‌‌‌లో ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌కు 70 శాతం వాటా ఉంది. మిగిలిన 30 శాతం వాటా ప్రభుత్వ కంపెనీ టెలీకమ్యూనికేషన్స్‌‌‌‌ కన్సల్టెంట్‌‌‌‌ ఇండియా కంట్రోల్లో ఉంది. ఫిక్స్డ్‌‌‌‌ లైన్ టెలిఫోన్‌‌‌‌, బ్రాడ్ బ్యాండ్‌‌‌‌ వంటి సర్వీస్‌‌‌‌లను ఈ కంపెనీ అందిస్తోంది.