మగవాళ్లు ఎల్లప్పుడూ యవ్వనంగా, అందంగా కనిపించాలా? అయితే ఈ చిన్న పొరపాట్లు అస్సలు చేయకండి!

మగవాళ్లు ఎల్లప్పుడూ యవ్వనంగా, అందంగా కనిపించాలా? అయితే ఈ చిన్న పొరపాట్లు అస్సలు చేయకండి!

వయసు పెరుగుతున్న  అందంగా, యవ్వనంగా కనిపిస్తుంటారు కొందరు మగవాళ్లు. అందుకు ఫుడ్ హ్యాబిట్స్, జీన్స్ కారణం అనేది తెలిసిందే. అయితే జుట్టు, చర్మం అందంగా కనిపించాలనే తొందరలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవేంటో తెలుసుకుంటే వాటివల్ల నష్టపోకుండా ఉండొచ్చు...

తల స్నానానికి హట్ వాటర్ వాడితే వెంట్రుకలు దెబ్బతింటాయి. చుండ్రు వచ్చి వెంట్రుకలు రాలిపోతాయి. ఈ సమస్య రాకుండా ఖరీదైన షాంపూ, కండీషనర్ వాడక్కరలేదు. కొద్దిగా యాపిల్ సిడార్ వెనిగర్ ను వేడినీళ్లలో  వేయాలి. ఆ నీళ్లతో తలస్నానం చేయాలి. సల్ఫేట్ లేని షాంపూ కూడా వాడొచ్చు. నల్లా, షవర్లకు ప్యూరిఫైయింగ్ ఫిల్టర్స్ బిగిస్తే బెటర్.

జీర్ణాశయంలో ఉండే ప్రొబ్యాక్టీరియా మన చర్మం తీరును ప్రభావితం చేస్తుంది. అందుకే పెరుగు తినాలి. లేదా ప్రొబయాటికన్స్  సప్లిమెంట్స్ రూపంలో తీసుకున్నా పర్లేదు. రాత్రి నిద్రపోయే ముందు పాదాలు, కాలి మడమలకు ఆముదం నూనెతో మసాజ్ చేసుకోవాలి. తరువాత పాదాలను ఉప్పు కలిపిన వేడి నీళ్లలో కాసేపు ఉంచాలి.

పళ్లు మెరవాలన్నా, నోటి దుర్వాసన, పంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా తరచూ డెంటిస్ట్ లను  కలవాలి. నోరు శుభ్రంగా ఉంచుకోవాలి. రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి. నీళ్లు బాగా తాగాలి. నోటి దుర్వాసన రాకుండా పైనాపిల్ ముక్కలు నమలాలి. వెనిగర్ ఉన్న మౌత్వాష్, ప్రొబయాటిక్స్, విటమిన్ -సి ఉన్న పండ్లు, ఆహారం తినాలి.