పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా ట్రక్కు ఛార్జీలు అక్కడే.. మందగిస్తున్న రవాణా.. సంక్షోభం అంటే ఇదేనా..?

పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా ట్రక్కు ఛార్జీలు అక్కడే.. మందగిస్తున్న రవాణా.. సంక్షోభం అంటే ఇదేనా..?

ఇండియాలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగినా ట్రక్కు ఛార్జీలు అక్కడే ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పిటికే చమురు ధరల పెరుగుదల సామాన్యుడిపై భారంగా తయారైంది. ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందని భావించారు. చమురు ధరలతో రవాణాలో కీలకమైన ట్రక్కు ధరలు పెరుగుతాయని భావించారు. కానీ .. ఎక్కడి ధరలు అక్కడే ఉండటం.. దీనికి తోడు రవాణాలో ఎలాంటి మార్పు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

గత 10 రోజులుగా డీజిల్ ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ, ట్రక్కు సరుకు రవాణా ఛార్జీలలో దానికి అనుగుణంగా పెరుగుదల కనిపించలేదు. సరుకు రవాణాకు గిరాకీ తక్కువగా ఉండటం, వాహనాల సంఖ్యఅధికంగా ఉండటం వంటివి దీనికి కారణం అంటున్నారు. మామూలుగా అయితే చమురు కంపెనీలు ధరలు పెంచినపుడు, పెరిగిన ఖర్చులను వినియోగదారులపై మోపడం కామన్. కానీ అలాంటి సిచువేషన్ రాకుండా ఉందంటే రవాణా వ్యవస్థలో ఉన్న మందగమనం ఊహించవచ్చు.

మే 15 నుండి మే 25 మధ్య డీజిల్ ధరలు లీటరుకు రూ. 7.50 పెరిగాయి, ఇందులో సోమవారం ( 2026 మే 25) ఒక్కరోజే లీటరుకు రూ. 2.71 పెరుగుదల నమోదైంది. అయితే, పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు ఉన్నప్పటికీ ట్రక్కింగ్ ప్రధాన మార్గాల్లో రవాణా ఛార్జీలలో మాత్రమే స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా నౌకా రవాణా  పెరిగినప్పటికీ, సరుకు రవాణా బలహీనంగా ఉండటంతో, పెరుగుతున్న డిమాండ్-సరఫరా మధ్య సమతుల్యత లోపిస్తోందని  పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 

ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ (AIMTC) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 9 మిలియన్ల ట్రక్కులు ఉండగా, వాటిలో దాదాపు 20–25% ట్రక్కులు తగినంత సరుకు రవాణా లేకపోవడం వల్ల ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి.

సెప్టెంబర్ 2025 నుండి మార్చి 2026 మధ్యకాలంలో వాణిజ్య వాహనాల అమ్మకాలు బలంగా జరగడం, ఈజీగా వెహికిల్ ఫైనాన్స్ లభ్యం, కంపెనీలు ట్రక్కుల ధరలు  భారీ తగ్గించడంతో వాహనాల సంఖ్య పెరిగింది. దీంతో ట్రక్కులకు సరిపడినంత సామర్థ్యంతో సరుకు రవాణా జరగటం లేదు. అదే సమయంలో, తయారీ రంగం,  ఎంఎస్ఎంఈ క్లస్టర్ల నుండి సరుకు రవాణా బలహీనపడటంతో, సరుకులు తగ్గిపోయాయి.  దీంతో అందుబాటులో ఉన్న సరుకుల కోసం రవాణాదారుల మధ్య పోటీ తీవ్రమైంది.

ఈ పరిస్థితి ముఖ్యంగా చిన్న ఫ్లీట్ ఆపరేటర్లను ప్రభావితం చేసిందని చెబుతున్నారు. వీరిలో చాలామంది ఈఎంఐల భారం నుంచి బయటపడేందుకు, అప్పులు చెల్లించేందుకు తక్కువ   రేట్లకే ట్రక్కులను నడుపుతున్నారు. 

ఇండియన్ ఫౌండేషన్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (IFTRT) ప్రకారం, కొన్ని నెలల క్రితం వరకు సుమారు 24 గంటల్లో సరుకులు తిరిగి వచ్చేవి, కానీ ప్రస్తుతం ట్రక్కులు లోడ్ల కోసం మూడు నుండి ఐదు రోజుల పాటు వేచి ఉంటున్నట్లు తెలుస్తోంది. 

పరిశ్రమ అంచనాల ప్రకారం, రవాణాదారుల నిర్వహణ ఖర్చులలో డీజిల్, ఇంధన ఖర్చులు సుమారు 50–60% వాటాను కలిగి ఉన్నాయి, అందువల్ల ఆపరేటర్లు ఇంధన ధరల పెరుగుదలను చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. కానీ  ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు ఖర్చుల పెరుగుదలను భారం  వినియోగదారులపై పడకుండా ఈ పరిస్థితులు  నిరోధిస్తున్నాయని రవాణాదారులు తెలిపారు.

క్రిసిల్ ఇంటెలిజెన్స్ ప్రకారం, డీజిల్ ధరలు లీటరుకు రూ. 5 పెరిగితే, రవాణాదారుల లాభాన్ని కాపాడేందుకు సాధారణంగా రవాణా ఛార్జీలను 2.5–2.8% మేర సవరించాల్సి ఉంటుంది. ఒకవేళ ధరలు లీటరుకు రూ. 10 పెరిగితే, రవాణా ఛార్జీలను 5–5.6% మేర పెంచాల్సి రావచ్చు. అయితే రవాణా లో ఉన్న మందగమనం, పారిశ్రామికంగా ఉత్పత్తి తగ్గటంతో.. ఇంధన పెరిగినా అవే ధలరకు ట్రక్కులను నడపాల్సిన పరిస్థితి.