
- ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు స్టాలిన్
హైదరాబాద్, వెలుగు: ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్)–90వ వార్షికోత్సవాలు ఈ నెల 10 నుంచి 30 వరకు నిర్వహిం చనున్నట్టు ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ఏ. స్టాలిన్ తెలిపా రు. గురువారం హిమాయత్ నగర్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం ఆ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ మణికంఠరెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి స్టాలిన్ చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. విద్యారంగం సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని, దీన్ని కాపాడేందుకు పాలకవర్గాలు నిస్సహాయ స్థితిలో ఉన్నాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. ప్రభుత్వ విద్యను నాశనం చేసి పేదలకు విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.