
మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్(Aishwarya rai) ఇటీవల కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల ఈ నటి తన 50వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా ఐష్‌పై నెట్టింట అభినందనల వర్షం కురిపించారు ఆమె అభిమానులు. కానీ, ఆమె భర్త అభిషేక్ బచ్చన్(Abhisheh bachhan) లేట్‌గా విషెస్ చెప్పడంపై కొందరు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.
తాజాగా బీటౌన్‌లో జరిగిన దీపావళి బాష్‌కు సైతం ఐశ్వర్య ఒక్కతే హాజరవడంతో గాసిప్స్ గుప్పుమంటున్నాయి. ఈ జంట విడాకులు తీసుకోనుందనే ప్రచారం మరోసారి తెరపైకి వస్తోంది. ఐష్ అభిమానులు మాత్రం అన్నింటికీ విడాకులతో ముడిపెట్టడం కరెక్ట్ కాదంటూ విమర్శకులకు కౌంటర్ ఇస్తున్నారు. చిన్న చిన్న కారణాలు చూపి విడాకులు రూమర్లు అంటగట్టడంపై ఫైర్ అవుతున్నారు.