ముగిసిన టెట్ పరీక్షలు.. జులై 5న ప్రిలిమినరీ 'కీ' రిలీజ్

ముగిసిన టెట్ పరీక్షలు.. జులై 5న ప్రిలిమినరీ 'కీ' రిలీజ్
  • జులై 5న ప్రిలిమినరీ 'కీ' రిలీజ్ 

హైదరాబాద్, వెలుగు: రాష్టంలో టెస్ట్ పరీక్షలు ముగిశాయి. జూన్ 18 నుంచి ఎగ్జామ్స్ మొదలవగా..రాష్ట్రవ్యాప్తంగా 66 కేంద్రాల్లో 16 సెషన్లలో నిర్వహించినట్టు టెట్ కన్వీనర్ రమేశ్ తెలిపారు. టెట్ పేపర్ 1కు మొత్తం 63,261 మంది దరఖాస్తు చేసుకోగా.. 47,224 (74.65%) మంది పరీక్షకు అటెండ్ అయ్యారు. పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ కేటగిరీలో 66,686 మంది అప్లై చేసుకోగా..  48,998 (73.48%) మంది పరీక్షలు రాశారు. 

సోషల్ స్టడీస్ లో  

53,706 మంది రిజిస్టర్ చేసుకోగా.. 41,207 (76.73%) మంది అటెండ్ అయ్యారని అధికారులు తెలిపారు. జులై 5న ప్రిలిమినరీ కీ రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు. ఏమైన అభ్యంతరాలుంటే జులై 8 సాయంత్రం 5గంటల వరకూ https://schooledu.telangana.gov.in వెబ్‌‌సైట్‌‌లోని లింక్ ద్వారా సమర్పించవచ్చని పేర్కొన్నారు.