హైదరాబాద్ మార్కెట్లోకి విక్టోరిస్..

హైదరాబాద్ మార్కెట్లోకి విక్టోరిస్..

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మారుతి సుజుకి కొత్త విక్టోరిస్ కారును హైదరాబాద్‌‌‌‌ శేరిలింగంపల్లిలోని పవన్ మోటార్స్ షోరూమ్‌‌‌‌లో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి లాంచ్​ చేశారు.  రూ. 11 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇది 1.5 లీటర్ హైబ్రిడ్, పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ మోడల్ 21.18 కిలోమీటర్లు,  హైబ్రిడ్ ఈసీవీటీ మోడల్ 28.65 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. 

ఆధునిక భద్రతా ఫీచర్లు,  ఫైవ్ స్టార్ భారత్ ఎన్​సీఏపీ రేటింగ్ దీని ప్రత్యేకతలు అని కంపెనీ తెలిపింది.  లెవల్ 2 ఏడీఏఎస్​ ఫీచర్లు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, 360 డిగ్రీ హెచ్‌‌‌‌డీ కెమెరా, ఏబీఎస్​ విత్ ఈబీడీ వంటి ఫీచర్లు ఉన్నాయి.