మారుతీ సుజుకీ కార్ల ధరలు తగ్గింపు.. ఎస్ ప్రెస్సో ధర రూ.1.29 లక్షలు డౌన్

మారుతీ సుజుకీ కార్ల ధరలు తగ్గింపు.. ఎస్ ప్రెస్సో ధర  రూ.1.29 లక్షలు డౌన్

న్యూఢిల్లీ: మారుతీ  సుజుకీ  తన కార్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. జీఎస్​టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని ఈ నెల 22 నుంచి అందిస్తున్నట్టు  తెలిపింది. ఎంట్రీ-లెవల్ కార్లపై మరింత ఎక్కువ తగ్గింపు ఇచ్చింది.  ఎంట్రీ-లెవల్ మోడల్ ఎస్ ప్రెస్సో ధర రూ.1,29,600 వరకు, ఆల్టో కే10 ధర రూ.1,07,600 వరకు తగ్గనున్నాయి.  

స్విఫ్ట్ ధర రూ.84,600 వరకు, బాలెనో ధర రూ.86,100 వరకు, ఫ్రాంక్స్ ధర రూ.1,12,600 వరకు తగ్గనున్నాయి. బ్రెజ్జా ధర రూ.1,12,700 వరకు, గ్రాండ్ విటారా రూ.1.07 లక్షల వరకు, జిమ్నీ రూ.51,900 వరకు, ఎర్టిగా రూ.46,400 వరకు, ఎక్స్​ఎల్​6 రూ.52,000 వరకు తగ్గుతాయని కంపెనీ తెలిపింది. 

ఇన్విక్టో ధరలు రూ.61,700 వరకు, ఈకో రూ.68 వేల వరకు, సూపర్ క్యారీ ఎల్సీవీ ధర రూ.52,100 వరకు తగ్గుతాయని  ప్రకటించింది.