కొడుకు రిసెప్షన్‌‌ క్యాన్సిల్‌‌ చేసి.. రైతుల యూరియాకు2 కోట్ల విరాళం

కొడుకు రిసెప్షన్‌‌ క్యాన్సిల్‌‌ చేసి.. రైతుల యూరియాకు2 కోట్ల విరాళం
  • సీఎం రేవంత్‌‌ రెడ్డికి చెక్కు అందజేసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ, వెలుగు: మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన కొడుకు బత్తుల సాయి ప్రసన్న, వెన్నెల దంపతుల రిసెప్షన్ కోసం ఖర్చు చేయాలనుకున్న రూ. 2 కోట్లు.. సీఎం రిలీఫ్‌‌ ఫండ్‌‌కు అందజేశారు. ఆయన గురువారం హైదరాబాద్‌‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి  చెక్కును అందజేశారు. రిసెప్షన్‌‌ రద్దు చేసుకున్నామని, ఆ డబ్బు తన నియోజకవర్గ రైతులకు ఉచితంగా యూరియా ఇచ్చేందుకు ఖర్చు చేయాలని సీఎంను కోరారు.