
- రూ.2,500 కోట్లు సేకరణ
న్యూఢిల్లీ: ఈ నెల 23 న ఓపెనై, 25న ముగిసే నాలుగు మెయిన్ బోర్డు ఐపీఓలు తమ ప్రైస్ బ్యాండ్‌ను ప్రకటించాయి. ఈ కంపెనీలు రూ. 2,500 కోట్లను సేకరించేందుకు రెడీ అయ్యాయి.
శేషసాయి టెక్నాలజీస్
పేమెంట్స్ సొల్యూషన్లు అందించే శేషసాయి టెక్నాలజీస్ ఐపీఓ ద్వారా రూ.813 కోట్లు సేకరించాలని చూస్తోంది. ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో షేరుకి రూ.402–రూ.423 గా నిర్ణయించింది. ఈ పబ్లిక్ ఇష్యూలో ఫ్రెష్ షేర్లను అమ్మడం ద్వారా రూ.480 కోట్లను, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా రూ.333 కోట్లను సేకరించాలని ప్లాన్ చేస్తోంది.
ఫ్రెష్ షేర్ల ఇష్యూ ద్వారా వచ్చిన ఫండ్స్‌లో రూ.198 కోట్లను తయారీ సామర్ధ్యాన్ని విస్తరించడానికి, రూ.300 కోట్లు అప్పు చెల్లించడానికి వాడనున్నారు. కనీస లాట్ సైజ్ 35 షేర్లు. డెబిట్, క్రెడిట్ కార్డులు, మాస్ ట్రాన్సిట్ కార్డులు, చెక్కులు వంటి సర్వీస్‌లను అందించే ఈ కంపెనీకి 2024–25 లో రూ.1,463.15 కోట్ల రెవెన్యూపై రూ.222.32 కోట్ల ప్రాఫిట్ వచ్చింది.
జారో ఎడ్యుకేషన్
జారో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ (జారో ఎడ్యుకేషన్) ఐపీఓ ద్వారా రూ.450 కోట్లు సేకరించనుంది. ప్రైస్ బ్యాండ్‌ను రూ.846–రూ.890 గా నిర్ణయించింది. కంపెనీ ఈ పబ్లిక్ ఇష్యూలో రూ.170 కోట్ల విలువైన ఫ్రెష్ షేర్లను అమ్మనుండగా, రూ.280 కోట్ల విలువైన షేర్లను ఓఎఫ్‌ఎస్ ద్వారా ప్రమోటర్ సంజయ్ సలుంఖే విక్రయించనున్నారు.
ఈ ఇష్యూ ద్వారా వచ్చిన ఫండ్స్‌లో రూ.81 కోట్లను బ్రాండ్, మార్కెటింగ్‌కు, రూ.45 కోట్లను అప్పు చెల్లించడానికి వాడతామని కంపెనీ చెబుతోంది. జారో ఎడ్యుకేషన్‌కు దేశం మొత్తం మీద 22 ఆఫీసులు, 17 ఐఐఎం క్యాంపస్ స్టూడియోలు ఉన్నాయి. 36 భాగస్వామ్య సంస్థలతో కలిసి పనిచేస్తోంది. మొత్తం 268 డిగ్రీలు, సర్టిఫికేషన్ ప్రోగ్రాములను అందిస్తోంది.
సోలార్‌వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్..
సోలార్ ఎనర్జీ సొల్యూషన్లను అందించే ఈ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.490 కోట్లు సేకరించాలని చూస్తోంది. ప్రైస్ బ్యాండ్ రూ.333–రూ.351. ఈ పబ్లిక్ ఇష్యూలో రూ.440 కోట్ల ఫ్రెష్ షేర్ల ఇష్యూ, రూ.50 కోట్ల ఓఎఫ్‌ఎస్ ఆఫర్ ఉంది. ఐపీఓ ద్వారా సేకరించిన ఫండ్స్‌ను సబ్సిడరీ కార్తిక్ సోలార్ వరల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి, ఎంపీలో1.2గిగావాట్ల సోలార్ పీవీ టాప్‌కాన్ ప్లాంట్ ఏర్పాటుకు వాడనుంది.
ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్
బ్రోకింగ్ కంపెనీ ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్స్ బ్రోకర్స్ తన ఐపీఓ ప్రైస్ బ్యాండ్‌ను రూ.393–రూ.414 గా నిర్ణయించింది. ఫ్రెష్ షేర్ల ఇష్యూ ద్వారా రూ.745 కోట్లను సేకరించాలని చూస్తోంది. ఇందులో ఓఎఫ్‌ఎస్ లేదు. ఐపీఓ ద్వారా సేకరించిన ఫండ్స్‌లో రూ.550 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ , కార్పొరేట్ అవసరాలకు వాడతామని కంపెనీ పేర్కొంది.
కనీస లాట్ సైజ్ 36 షేర్లు. ఈ కంపెనీకి కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.845.70 కోట్ల రెవెన్యూపై రూ.103.61 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. ఆనంద్ రాఠీ దేశం మొత్తం మీద 90 బ్రాంచీలు, 1,125 అథరైజ్డ్ ఏజెంట్ల ద్వారా 290 నగరాల్లో సేవలందిస్తోంది.