ఆర్‌‌‌‌ఎస్‌‌ బ్రదర్స్‌‌లో దసరా ఆఫర్లు.. కనీసం రూ.2 వేల కొనుగోలుపై గిఫ్ట్‌‌ గ్యారెంటీ

ఆర్‌‌‌‌ఎస్‌‌ బ్రదర్స్‌‌లో దసరా ఆఫర్లు.. కనీసం రూ.2 వేల కొనుగోలుపై గిఫ్ట్‌‌ గ్యారెంటీ

హైదరాబాద్‌‌, వెలుగు: రిటైల్ షాపింగ్‌‌లో ప్రత్యేక బ్రాండ్‌‌ సృష్టించుకున్న ఆర్‌‌‌‌ఎస్ బ్రదర్స్‌‌,  ‘దసరా బ్లాక్‌‌బస్టర్‌‌‌‌ స్పాట్‌‌ గిఫ్ట్స్‌‌’  ఆఫర్లతో వినియోగదారులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది. రూ.2 వేల విలువ చేసే ప్రతీ కొనుగోలుపై గిఫ్ట్‌ ఇస్తోంది. ఈ ఆఫర్లు కేవలం కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయని సంస్థ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది. 

రూ.4,495 విలువైన పట్టుచీరను కొంటే రూ.45 కే మరో చీరను కానుకగా ఇస్తామని తెలిపింది. అదేవిధంగా రూ.4,995 విలువ చేసే పట్టు చీర కొంటే మిక్సీగ్రైండర్‌‌‌‌ను గిఫ్ట్​గా ఇస్తామని వెల్లడించింది. లేడిస్ వెస్ట్రన్‌‌వేర్‌‌‌‌, మెన్స్‌‌వేర్‌‌‌‌, కిడ్స్‌‌వేర్‌‌‌‌పై కూడా అనేక రకాల ఆకర్షణీయమైన కానుకలు కొనుగోలుదారులకు అందిస్తామని  తెలిపింది. 

ఆకర్షణీయమైన డిజైన్లు, సరికొత్త వెరైటీలతో పండుగ కలెక్షన్‌‌, సరసమైన ధరలతో అద్భుతమైన ఆఫర్స్‌‌,  స్పాట్‌‌లోనే గిఫ్ట్‌‌లు ఇవ్వడంతో  వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు.