ఇండియా కూటమికి అధికారమిస్తే చొరబాట్లు పెరుగుతయ్: అమిత్ షా

ఇండియా కూటమికి అధికారమిస్తే చొరబాట్లు పెరుగుతయ్: అమిత్ షా

పాట్నా: బిహార్‌‌‌‌లో ఇండియా కూటమి గనక అధికారంలోకి వస్తే రాష్ట్రం చొరబాటుదారులతో నిండిపోతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని బీజేపీ క్యాడర్ కు పిలుపునిచ్చారు. గురువారం బిహార్‌‌లోని డెహరీ ఆన్‌‌సోన్‌‌లో పార్టీ కార్యకర్తలతో అమిత్‌‌ షా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగ్లాదేశీ చొరబాటుదారులను రక్షించేందుకే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో ఇటీవల ఓటర్‌‌ అధికార్​యాత్ర నిర్వహించారని అన్నారు. 

దేశంలో ఓట్ల చోరీ జరిగిందంటూ ఇండియా కూటమి తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు.  బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తారని గతంలోనూ దుష్ప్రచారం చేశారని విమర్శించారు. మన ఉద్యోగాలు, పక్కా ఇండ్లు, ఉచిత వైద్యాన్ని చొరబాటుదారులకు ఇవ్వాలని రాహుల్​గాంధీ, ఆయన బృందం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.